Rahul Dravid : అటు వన్డేల్లో ఇటు టెస్టుల్లో పేలవమైన ఆట తీరుతో పరాజయం మూటగట్టుకున్న భారత జట్టును వెనకేసుకు వచ్చాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. ఈ మిస్టర్ కూల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
మూడు వన్డేలతో పాటు రెండు టెస్టులను వైట్ వాష్ చేసింది సౌతాఫ్రికా టీం. వారు కొట్టిన దెబ్బకు భారత జట్టు అబ్బా అంటోంది.
బారత జట్టు ఓటమి పాలు కావడానికి ప్రధాన కారణం కేఎల్ రాహుల్ నాయకత్వ లోపం అంటూ సంచలన ఆరోపణలు చేశాడు భారత జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ సునీల్ గవాస్కర్.
ఈ తరుణంలో రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid )రాహుల్ ను వెనకేసుకు రావడం చర్చకు దారి తీసింది. అయితే ఎవరినీ పల్లెత్తు మాట అనేందుకు ఇష్ట పడడు ది వాల్. ఎందుకంటే మొదటి నుంచీ చాలా కూల్.
ఆయన ఆట తీరుతోనే కాదు వ్యక్తిత్వ పరంగా కూడా అందనంత ఎత్తులో ఉంటాడు. మిగతా మ్యాచ్ ల సంగతి పక్కన పెడితే మూడో వన్డే మాత్రం నువ్వా నేనా అన్న రీతిలో సాగింది.
టీమిండియా నాలుగు పరుగుల తేడాతో ఓడి పోయింది. మ్యాచ్ అనంతరం రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid )మీడియాతో మాట్లాడాడు. రాహుల్ కెప్టెన్సీ బాగుందని రాను రాను రాటు దేలుతాడంటూ కితాబు ఇచ్చాడు.
అంతటా కేఎల్ రాహుల్ ను టార్గెట్ చేస్తున్న తరుణంలో ద్రవిడ్ అతడికి వత్తాసు పలకడం విశేషం. సఫారీ టూర్ తమకు ఓ కనువిప్పు లాంటిదన్నాడు.
తమకు ఉన్న నైపుణ్యాలను మైదానంలో సరిగా వినియోగించు కోలేక పోయామని ఒప్పుకున్నాడు ద్రవిడ్. లోపాలు దిద్దుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నాడు.
Also Read : నాయకత్వ లోపం భారత్ కు శాపం