Ravi Shastri : భారత జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సంచలన కామెంట్స్ చేశాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడాన్ని తప్పు పట్టాడు. ఇంకా జట్టుకు సంబంధించి రెండేళ్ల పాటు నాయకత్వం వహించే సత్తా కలిగి ఉన్నాడని పేర్కొన్నాడు.
ప్రస్తుతం రవిశాస్త్రి చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఇదిలా ఉండగా రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ కాంబినేషన్ లో భారత జట్టు ఎనలేని విజయాలు సాధించాయి. మొదట తాను తప్పుకున్నాడు. తర్వాత కోహ్లీ గుడ్ బై చెప్పాడు.
ఈ తరుణంలో రవిశాస్త్రి (Ravi Shastri )చేసిన వ్యాఖ్యలు హల్ చల్ చేశాయి. టీమిండియాకు ఇంకా కొంత కాలం పాటు నాయకత్వం వహించే సత్తా కోహ్లీకి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఇదిలా ఉండగా సఫారీ టూర్ సందర్బంగా 1-2 తేడాతో టెస్టు సీరీస్ కోల్పోయాక తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు కోహ్లీ. ఈ నిర్ణయం అందరినీ విస్తు పోయేలా చేసింది.
అయితే బీసీసీఐ తప్పించక ముందే తాను తప్పుకున్నాడని పాకిస్తాన్ మాజీ ప్లేయర్ రషీద్ లతీఫ్, షోయబ్ అఖ్తర్ కామెంట్ చేయడం కలకలం రేపింది. ఈ తరుణంలో రవిశాస్త్రి(Ravi Shastri )చేసిన వ్యాఖ్యలు మరింత ఇరకాటలంలోకి నెట్టాయి.
టెస్టు కెప్టెన్ గా కోహ్లీ 68 మ్యాచ్ ల కు సారథ్యం వహిస్తే 40 మ్యాచ్ లలో గెలుపొందేలా చేశాడు. 17 మ్యాచ్ లలో ఓడి పోయాడు. అతడి సక్సెస్ రేట్ బాగానే ఉన్నప్పటికీ నాయకత్వం నుంచి తప్పుకున్నాడు.
ఈ సమయంలో కోహ్లీ ఇంకా కొన్నేళ్ల పాటు భారత జట్టును నడిపించగలడని అన్నాడు రవిశాస్త్రి.
Also Read : అందరి చూపు సెలెక్షన్ కమిటీ వైపు