ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ – ఐసీసీ 2021 సంవత్సరానికి అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రకటించింది. దక్షిణాఫ్రికాకు చెందిన మరైస్ ఎరాస్మస్ ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది.
Marais Erasmus : ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ధ్రువీకరించింది ఐసీసీ. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తో పాటు మూడు ఫార్మాట్ లలో 20 అంతర్జాతీయ మ్యాచ్ లకు అంపైర్ గా వ్యవహరించాడని ఐసీసీ పేర్కొంది.
యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ రిచ్ లీగ్ లో జరిగిన ఫైనల్ కు అంపైర్ గా ఎరాస్మస్ వ్యవహరించాడు. ఇదిలా ఉండగా ఎరాస్మస్ (Marais Erasmus )అందరితో కలుపుగోలుగా ఉంటూ హుషారు కలిగించడం విశేషం.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అంపైర్లు ఉన్నప్పటికీ గత ఏడాది అత్యధిక మ్యాచ్ లకు అంపైర్ గా నిష్పక్షపాతంగా వ్యవహరించినందుకు ఈ అత్యున్నత పురస్కారానికి ఎరాస్మస్ (Marais Erasmus )ను ఎంపిక చేసినట్లు స్పష్టం చేసింది ఐసీసీ.
2016, 2017 లో డేవ్ షెపర్డ్ ట్రోఫీలను కూడా ఆయన గెలుచుకున్నాడు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఐసీసీ పురుషుల అత్యుత్తమ క్రికెటర్ గా పాకిస్తాన్ కు చెందిన వికెట్ కీపర్, ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ ను ఎంపిక చేసింది.
ఇక మహిళా టీ20 అత్యుత్తమ విమెన్ క్రికెటర్ గా ఇంగ్లండ్ కు చెందిన వికెట్ కీపర్, బ్యాటర్ టామీ బ్యూమంట్ ను ఎంపిక చేసింది. టీ20 లో టాప్ స్కోరర్ గా రిజ్వాన్ నిలిచాడు.
ఇక టామీ బ్యూమంట్ స్వదేశంలో జరిగిన టూర్ లో దుమ్ము రేపింది. ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ గా నిలిచింది.
Also Read : అందరి చూపు సెలెక్షన్ కమిటీ వైపు