LIC Credit Card : దేశంలో అతి పెద్ద ప్రభుత్వరంగ బీమా సంస్థగా పేరొందిన భారతీయ జీవిత బీమా సంస్థ – ఎల్ఐసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు క్రెడిట్ కార్డు బిజినెస్ లోకి దిగుతున్నట్లు ప్రకటించింది.
ఇందుకు గాను ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – ఐడీబీఐ సహకారంతో రూపే క్రెడిట్ కార్డును తీసుకు వచ్చింది.
ఇందులో లుమిన్ కార్డ్, ఎక్లాట్ కార్డ్స్ పేరుతో కొత్తగా ప్రారంభించింది ఎల్ఐసీ.
ఇందుకు సంబంధించి ఖుష్ కబర్ చెప్పింది జీవిత బీమా సంస్థ. అదేమిటంటే కస్టమర్, పాలసీ హోల్డర్,
ఏజెంట్ గనుక సంస్థలో నమోదై ఇప్పటి దాకా వుంటే ఉచితంగా క్రెడిట్ కార్డు(LIC Credit Card) పొందే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
ఇందుకు రెట్టింపు రివార్డులు కూడా పొందవచ్చని తెలిపింది ఎల్ఐసీ . ఈ కార్డుల ద్వారా బీమా పాలసీలకు సంబంధించి ప్రీమియం చెల్లిస్తే కొన్ని పాయింట్లు అదనంగా పొందే వీలుంది.
పెట్రోల్ గనుక కొనుగోలు చేస్తే వాటిపై సర్ ఛార్జ్ అంటూ ఉండదని తెలిపింది. ఎల్ఐసీ ఐడీబీఐ ఎక్లాట్ కార్డు (LIC Credit Card)దారులు ఎయిర్ పోర్టుల్లోని కాంప్లిమెంటరీ లాంజ్ లను ఉచితంగా ఉపయోగించుకునే సదుపాయం కల్పించినట్లు వెల్లడించింది ఎల్ఐసీ.
ప్రమాద బీమా కూడా అందజేస్తోంది. కార్డు పొందిన రెండు నెలల లోపు రూ. 10 వేలు గనుక ఖర్చు చేస్తే వేయి లేదా 15 వందలు అదనంగా బోనస్ పొందే వీలుందని తెలిపింది.
కార్డు హోల్డర్లు ఇతర ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది ఎల్ఐసీ.
Also Read : ఎలోన్ మస్క్ కు ‘మరాఠా’ ఆహ్వానం