Brendan Taylor : వ్యాపార‌వేత్త బెదిరించాడ‌న్న బ్రెండ‌న్

మ్యాచ్ ఫిక్సింగ్ చేయ‌మ‌న్నార‌ని ఆరోప‌ణ

Brendan Taylor : జింబాబ్వే మాజీ స్కిప్ప‌ర్ బ్రెండ‌న్ టేల‌ర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. ఆ జ‌ట్టు త‌ర‌పున అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన క్రికెట‌ర్ గా పేరొందాడు.

ప్ర‌పంచ వ్యాప్తంగా మ్యాచ్ ఫిక్సింగ్ వ్య‌వ‌హారంపై క‌ల‌క‌లం రేగుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో టేల‌ర్ (Brendan Taylor )చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత నిప్పు పెట్టేలా ఉన్నాయి. బ్రెండ‌న్ ఏకంగా భార‌తీయ వ్యాపార వేత్త పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు.

2019లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌న్నాడు. ఫిక్సింగ్ చేయ‌మంటూ బెదిరించాడ‌ని వాపోయాడు. ఇందుకు గాను 15000 డాల‌ర్లు ఆఫ‌ర్ చేశాడ‌ని తెలిపాడు. ఈ విష‌యాన్ని బ్రెండ‌న్ టేల‌ర్(Brendan Taylor )త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం విశేషం.

అయితే ఆనాటి ఆర్థిక ప‌రిస్థితుల కార‌ణంగా తాను కొంత న‌గ‌దు తీసుకున్న‌ట్లు తెలిపాడు. ఇదిలా ఉండ‌గా బ్రెండ‌న్ 2021లో తాను ఆట నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

ఓ భార‌తీయ వ్యాపార‌వేత్త ర‌మ్మంటే ఇండియాకు వ‌చ్చాన‌ని పేర్కొన్నాడు. ఓ పార్టీ నిర్వ‌హిస్తే అక్క‌డికి వెళ్లాన‌ని త‌న‌కు కొకైన్ ఆఫ‌ర్ చేశార‌ని , దానిని సేవిస్తుండ‌గా వీడియోలు తీసి బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారంటూ ఆరోపించాడు టేల‌ర్.

ఆ స‌మ‌యంలోనే మ్యాచ్ ఫిక్సింగ్ కూడా చేయ‌మ‌న్నారంటూ పేర్కొన్నాడు. ఆనాడు త‌మ‌కు జీతాలు చెల్లించ లేని స్థితిలో త‌మ బోర్డు ఉంద‌న్నాడు. తాను ఒప్పుకోక పోయే స‌రికి బ్లాక్ మెయిలింగ్ కు దిగాడ‌ని ఆరోపించాడు.

గ‌త కొంత కాలంగా తాను మాన‌సికంగా, శారీర‌కంగా కృంగి పోయాన‌ని వాపోయాడు బ్రెండ‌న్ టేల‌ర్. కాగా ఆ భార‌తీయ వ్యాపార‌వేత్త ఎవ‌రు అనే దానిపై చ‌ర్చ కొన‌సాగుతోంది.

Also Read : కోహ్లీ కెప్టెన్సీపై ర‌విశాస్త్రి కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!