Kavita Krishnamurthy : భారతీయ సినీ జగత్తులో కవితా కృష్ణమూర్తి ది విలక్షణమైన గొంతు. ఆమె పలు భాషల్లో పాడి మెప్పించారు. తన అద్భుతమైన గాత్రంతో అలరించారు. ఇవాళ ఆమె పుట్టిన రోజు.
1958 జనవరి 25న తమిళ అయ్యర్ కుటుంబంలో జన్మించారు. కవితా కృష్ణమూర్తి అసలు పేరు శారద. శాస్త్రీయ గాయనిగా తన కెరీర్ స్టార్ట్ చేశారు.
ఆమె రాజస్థానీ, బెంగాలీ, కన్నడ, హిందీ, భోజ్ పురి, తెలుగు, ఒడియా, మరాఠీ, ఇంగ్లీష్ , ఉర్దూ, తమిళం, మలయాళం, గుజరాతీ, నేపాలీ, అస్సామీ, కొంకణి తదితర భాషల్లో 50 వేల పాటలు పాడింది.
మొత్తం 36 భాషల్లో తన గానాన్ని పంచింది. నాలుగు సార్లు ఉత్తమ ఫిల్మ్ ఫేర్ గాయనిగా అవార్డులు అందుకుంది.
1995 నుంచి 97 దాకా పురస్కారాలు పొందింది. 2005లో పద్మశ్రీ అవార్డు వరించింది.
ప్రముఖ వయోలిన్ విద్యాంసుడిగా పేరొందిన ఎల్. సుబ్రమణ్యంను పెళ్లి చేసుకుంది.
ప్రస్తుతం బెంగళూరులో ఉంటోంది కవితా కృష్ణమూర్తి. 1971లో బెంగాలీ చిత్రంలో పాడే చాన్స్ దక్కించుకున్నారు.
1976లో లక్ష్మీకాంత్ ప్యారేలాల్ కవితలోని(Kavita Krishnamurthy ) ప్రతిభను గుర్తించారు. 1976లో విలాయత్ ఖాన్ స్వరకల్పనలో తన మొదటి పాటను రికార్డ్ చేసింది.
ఆయేగా ఆనే వాలా మహల్ సూపర్ హిట్ మూవీ పాట రీమేక్. లక్ష్మీకాంత్ ఆమెకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చాన్స్ ఇచ్చాడు.
ఆ తర్వాత లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ఆస్థానంలో గాయనిగా సెటిల్ అయ్యారు. 1978లో గిరీష్ కర్నాడ్ దర్శకత్వం వహించిన ఒండనొండు కలదల్లి లో కవితా కృష్ణమూర్తి(Kavita Krishnamurthy ) పాడింది. ఆ పాటకు మంచి పేరు వచ్చింది.
1985లో ప్యార్ ఝుక్తా నహీన్ లో పాడిన తుమ్సే మిల్కర్ నా జానే క్యోన్ సాంగ్ బిగ్ హిట్ గా నిలిచింది. 1986లో వచ్చిన మిస్టర్ ఇండియాలో పాడిన రెండు పాటలు ఆమెకు ఎంతో పేరు తీసుకు వచ్చేలా చేశాయి.
1990లో ఆర్డీ బర్మన్ స్వర పరిచిన 1942 ఏ లవ్ స్టోరీ చిత్రంలో గాయనిగా స్టార్ డమ్ తెచ్చింది. ఆ తర్వాత వరుస హిట్లతో దూసుకు పోయింది. ఒక ప్రేమఖ, యారానా, అగ్ని సాక్షి ఇలా ఎన్నో సినిమాలలో పాడింది కవితా కృష్ణమూర్తి.
రియాల్టీ షోస్ కు జడ్జీగా వ్యవహరించింది. ఆమె పాడిన భక్తి గీతాలు పాపులర్ అయ్యాయి. కవిత తన భర్తతో కలిసి 2007లో బెంగళూరులో సుబ్రమణ్యం అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనే సంగీత సంస్థను ప్రారంభించారు.
2013లో స్వంత యాప్ ను స్టార్ట్ చేసింది. 2015లో జైన్ యూనివర్శిటీ కవితా కృష్ణమూర్తికి గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ఎన్నో అవార్డులు మరెన్నో పురస్కారాలు ఆమె అందుకున్నారు.
ఆమెకు ఎస్పీబీ అంటే వల్లమాలిన అభిమానం. ఆయన మరణాన్ని తట్టుకోలేక పోయారు కవితా. ఏది ఏమైనా ఆమె మనతో పాటు ఉన్నందుకు ఆనంద పడాలి.
Also Read : వెండి తెరపై ఎంఎస్ చెరగని ముద్ర