CSA BCCI : ఇదేదో విచిత్రంగా ఉంది కదూ. అవును ప్రస్తుతం అత్యధికంగా కాసులు కురిపించే క్రీడ ఏదైనా ఉందంటే అది క్రికెట్. ఇక ఈ ఆటలో పలు ఫార్మాట్ లు ఉన్నప్పటికీ ఒక్క ఇండియన్ ప్రిమీయర్ లీగ్ – ఐపీఎల్ అనే సరికల్లా ఎక్కడలేని జోష్ పుట్టుకు వస్తుంది.
ప్రతి ఏటా ఐపీఎల్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ(CSA BCCI ).
గత ఏడాది యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 రిచ్ లీగ్ ను నిర్వహించింది.
బీసీసీఐకి ఈ ఒక్క మెగా లీగ్ తో భారీగా ఆదాయం సమకూరింది.
అంతే కాదు ప్రపంచంలో ఏ క్రీడా సంస్థకు రానంత డబ్బులు ఒక్క ఐపీఎల్ వేలంలో రెండు జట్లకు బిడ్ పలకడం ద్వారా ఏకంగా రూ. 1725 కోట్లు వచ్చాయి.
ఇది ప్రపంచాన్ని ప్రత్యేకించి క్రీడా సంస్థలను నివ్వెర పోయేలా చేసింది. ఇక ఊహించని రీతిలో స్పాన్సర్ షిప్ ,
ఆయా కార్పొరేట్ సంస్థల నుంచి ప్రకటనల రూపేణా కోట్లాది రూపాయలు బీసీసీఐ వళ్లో వాలి పోతున్నాయి.
అందుకే బీసీసీఐపై అమిత్ షా కన్ను పడిందంటారు తెలిసిన వాళ్లు. తన తనయుడిని ఇప్పుడు సెక్రటరీగా చేశాడు.
రాబోయే కాలంలో బీసీసీఐ నికర ఆదాయం రూ. 50 వేల కోట్లకు పైగా ఉండబోతోందని అంచనా.
ఇది దేశంలోని పలు రాష్ట్రాల బడ్జెట్ ల కంటే ఎక్కువ కావడం విశేషం.
ఇక ఐపీఎల్ రిచ్ లీగ్ విషయానికి వస్తే ఈసారి భారత్ లోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.
అయితే కరోనా కేసుల కారణంగా ప్రత్యామ్నాయంగా తటస్థ వేదికలను కూడా చూస్తోంది. ఈ తరుణంలో ఇప్పటికే భారత్ తో సీరీస్ సక్సెస్ గా ముగించిన క్రికెట్ సౌతాఫ్రికా బీసీసీఐకి లేఖ రాసినట్లు సమాచారం.
దయచేసి మా దేశంలో లీగ్ నిర్వహిస్తే ఖర్చులతో పాటు అన్నీ కలిసి వస్తాయని పేర్కొనట్లు టాక్. దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు బీసీసీఐ.
Also Read : అవకాశాలు సరిగా వాడుకోలేదు