Poetry Competitions 2022 : తెలుగుఇజం కవితా పోటీలకు స్వాగతం
దమ్మున్న కలాలకు సాదర ఆహ్వానం
Poetry Competitions 2022 : ఏబీసీడీ మీడియా ఆధ్వర్యంలోని తెలుగు ఇజం పోర్టల్ తెలుగు సాహితీ పిపాసకులు, ప్రేమికులు, ఔత్సాహికులకు అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది.
గణతంత్ర దినోత్సవం రోజు 26 న కవితా మహోత్సవాలకు శ్రీకారం చుట్టింది. మహోత్సవాల పేరుతో కవితా పోటీలను(Poetry Competitions 2022) ఫేస్ బుక్ వేదికగా నిర్వహిస్తోంది. కవులు, కవయిత్రులు, కళాభిమానులు, సాహితీ ప్రియులు తమ కలాలకు పదును పెట్టడమే.
ముందుగా మీరు చేయాల్సింది ఫేస్ బుక్ లోని తెలుగు ఇజం గ్రూప్ లో జాయిన్ కావడమే. ఇందులో పాల్గొనాలంటే కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
సంవత్సరం పొడవునా ప్రతి ఆదివారం ఏదో ఒక అంశంపై ఈ వేదికగా ప్రకటిస్తుంది తెలుగు ఇజం యాజమాన్యం. ఇచ్చిన అంశంపై ఆ వారంలోనే కవితలు రాసి పంపించాల్సి ఉంటుంది.
ఆ వారంలో వచ్చిన కవితలలో ఉత్తమమైన కవితకు రూ. 516 లు ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన కవితలలో నాణ్యమైన వాటిని ఎంపిక చేసి పుస్తకాన్ని ప్రచురించడం జరుగుతుంది.
కవులు, కవయిత్రులు విధిగా తెలుగు భాషలోనే రాయాల్సి ఉంటుంది. అత్యవసరమైతే తప్ప అన్య ( ఇతర భాషా ) పదాలు వాడ కూడదు.
ప్రత్యేకించి కవులు గుర్తు పెట్టు కోవాల్సింది కులాలు, మతాలు, ప్రాంతాలు, ఇతరుల్ని కించ పర్చడం, వివిధ అంశాలను పేర్కొంటూ ప్రస్తావిస్తూ రాసే కవితలను పూర్తిగా తిరస్కరించడం జరుగుతుంది.
పోటీలకు ఆ కవితలను, రాసిన రచయితలు, కవులను పరిగణలోకి తీసుకోం. కాగా వారానికి ఒకసారి గెలుపొందే కవితలను(Poetry Competitions 2022) అంతిమ పోటీకి పరిశీలించడం జరుగుతుంది.
మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి బంగారు, కాంస్య, రజత పతకాలను 2023లో ఫిబ్రవరిలో నిర్వహించే కళా వేదిక లో విజేతలకు ప్రముఖులతో బహూకరించడం జరుగుతుంది.
ఇంకెందుకు ఆలస్యం మీ పదునైన భావాలకు రెక్కలు తొడగండి. కలాలను ఝులిపించండి. విజేతలుగా నిలవండని కోరుతోంది తెలుగుఇజం న్యూస్ పోర్టల్.
Also Read : క్విజ్ లో పాల్గొనండి సత్తా చాటండి
GREAT TO HEAR THE NEWS .