Dale Steyn : దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సఫారీ టూర్ లో భాగంగా భారత జట్టు ఇప్పటికే వన్డే, టెస్టు సీరీస్ లు కోల్పోయింది. టీమిండియా చెత్త ప్రదర్శనతో చేతులెత్తేసింది.
దీంతో తాజా, మాజీ ఆటగాళ్లు భారత ఆటగాళ్లను ఒక ఆట ఆడుకుంటున్నారు. పేలవమైన నాయకత్వం కూడా ప్రధాన కారణమంటూ నిప్పులు చెరిగారు. కేఎల్ రాహుల్ అసలు కెప్టెనేనా అంటూ మండిపడ్డారు భారత మాజీ కెప్టెన్,
ప్రముఖ కామెంటేటర్ సునీల్ గవాస్కర్. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ప్లేయర్ డేల్ స్టెయిన్(Dale Steyn )సంచలన కామెంట్స్ చేశాడు. భారత జట్టులో రవీంద్ర జడేజా లాంటి స్టార్ ఆటగాడు లేక పోవడం బాధాకరమన్నాడు.
అతడు ఉండి ఉంటే జట్టు పరిస్థితి మరోలా ఉండేదన్నాడు. ప్రోటీస్ టీంపై మెరుగైన ప్రదర్శన చేసి ఉండే వాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు డేల్ స్టెయిన్.
ప్రధానంగా భారత జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ తో పాటు మిడిల్ స్పెల్ బౌలింగ్ కూడా అత్యంత చెత్తగా మారిందన్నాడు.
ఒకరిద్దరు మెరిశారే తప్పా మిగతా వాళ్లంతా ఏదో ట్రావెల్ టూర్ కు వచ్చినట్లు ఆడారంటూ ఎద్దేవా చేశాడు. ఇదే సమయంలో జడేజా లాంటి ప్లేయర్ ఉంటే బావుండేదన్నాడు.
ప్రస్తుతం డేల్ స్టెయిన్ చేసిన కామెంట్స్ భారత క్రికెట్ శిబిరంలో కలకలం రేపుతున్నాయి. తాను కావాలని ఎవరినీ కించపర్చేలా కామెంట్ చేయలేదని కాక పోతే భారత జట్టు పరిస్థితి దారుణంగా ఉందన్న విషయాన్ని గుర్తించాలని హెచ్చరించాడు.
Also Read : దయచేసి మా వైపు కన్నేయండి