Dasun Shanaka : టీ20 సీరీస్ కు శ్రీ‌లంక సార‌థిగా ‘ష‌న‌క‌’

ప్ర‌క‌టించిన శ్రీ‌లంక క్రికెట్ బోర్డు

Dasun Shanaka  : శ్రీ‌లంక క్రికెట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇవాళ ఆస్ట్రేలియాలో జ‌రిగే టీ20 సీరీస్ కు సంబంధించి శ్రీ‌లంక టీమ్ కెప్టెన్ గా ద‌సున్ ష‌న‌కను ప్ర‌క‌టించింది.

ఇందులో భాగంగా ఇరు జ‌ట్ల మ‌ధ్య ఐదు టీ20 మ్యాచ్ లు జ‌ర‌గ‌నున్నాయి.

వ‌చ్చే నెల ఫ్రిబ‌వ‌రి 11 నుంచి సిడ్నీ, మ‌నుకా ఓవెల్, మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ల‌లో మూడు వేదిక‌ల‌లో ఈ మ్యాచ్ లు జ‌ర‌గ‌నున్నాయి.

ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న టీ20 సీరీస్ లో పాల్గొనేందుకు గాను లంక జ‌ట్టును ఖ‌రారు చేసేందుకు ఇవాళ శ్రీ‌లంక క్రికెట్ సెలెక్ష‌న్ క‌మిటీ స‌మావేశమైంది.

ఇందుకు సంబంధించి జ‌ట్టును ఎంపిక చేసింది.

ఈ మేర‌కు శ్రీ‌లంక యువ‌జ‌న , క్రీడ‌ల శాఖ మంత్రి న‌మ‌ల్ రాజ‌ప‌క్స ఆమోదం తెలిపారు.

ముంద‌స్తుగా సిడ్నీ, ఓవ‌ల్, మెల్ బోర్న్ , క్వీన్స్ లాండ్ , అడిలైడ్ మైదానాల‌ను ఎంపిక చేసింది ఆస్ట్రేలియా.

కానీ క‌రోనా మ‌హ‌మ్మారి దృష్టిలో పెట్టుకుని మూడు మైదానాల‌లోనే ఐదు టీ20 మ్యాచ్ ల‌ను నిర్వ‌హించాల‌ని క్రికెట్ ఆస్ట్రేలియా , శ్రీ‌లంక క్రికెట్ బోర్డులు ఓ అంగీకారానికి వ‌చ్చాయి.

ఇందులో భాగంగా ఫిబ్ర‌వ‌రి 11న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో మొద‌టి టీ20 మ్యాచ్ జ‌రుగుతుంది. 13న సీసీజీలో, 15న మ‌నుకా ఓవ‌ల్ లో , 18న ఎంసీజీలో , 20న మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో మ్యాచ్ లు కొన‌సాగుతాయి.

ఇదిలా ఉండ‌గా శ్రీ‌లంక జ‌ట్టు ఇలా ఉంది. ద‌సున్ ష‌న‌క కెప్టెన్ కాగా చ‌రిత్ అస‌లంక‌, అవిష్క ఫెర్నాండో, నిస్సాంక‌, గుణ తిల‌క‌, కుసాల్ మెండీస్ , దినేష్ చండిమాల్ , చ‌మిక క‌రుణ రత్నే, జ‌నిత్ లియ‌నాగే, క‌మిల్ మిషార(Dasun Shanaka )ఉన్నారు.

వీరితో పాటు ర‌మేష్ మెండీస్ , వ‌నిందు హ‌స‌రంగా, డువాన్ తుస్హ‌రంగా, ల‌హిరుహ‌రంగా చ‌మీర‌, బిసుర ఫెర్నాండో, మ‌హేష్ తీక్ష‌ణ‌, వాంట‌ర్నే, ప్ర‌వీణ్ జ‌య‌విక్ర‌మ్ , శిరాన్ ఫెర్నాండో ఉన్నారు.

Also Read : ఐసీసీ ర్యాంకింగ్స్ లో ష‌ఫాలీ వ‌ర్మ టాప్

Leave A Reply

Your Email Id will not be published!