T20 ODI Teams : సఫారీ టూర్ తో అటు వన్డే ఇటు టెస్టు సీరీస్ లు కోల్పోయిన భారత జట్టును(T20 ODI Teams )ఎంపిక చేసిన బీసీసీఐ సెలెక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఒకానొక దశలో మొత్తం జట్టునే మార్చేసి కొత్త ఆటగాళ్లను తీసుకోవాలంటూ వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించాడు.
ఈ తరుణంలో స్వదేశంలో వెస్టిండీస్ తో పాటు శ్రీలంక జట్లు టీ20, వన్డే సీరీస్ లు ఆడనున్నాయి.
కోహ్లీ తప్పు కోవడం, కేఎల్ రాహుల్ తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించడంతో పూర్తిగా గందరగోళానికి దారి తీసింది.
దీంతో జట్ల ఎంపిక ఎంపిక కమిటీకి తలనొప్పిగా మారింది. ఇక గాయం కారణంగా సఫారీ టూర్ కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ పూర్తి ఫిట్ నెస్ తో రెడీ అయ్యాడు.
తాజాగా స్వదేశంలో జరిగే విండీస్ టూర్ కు సంబంధించి టీ20, వన్డే జట్టును డిక్లేర్ చేసింది బీసీసీఐ.
ఇక విరాట్ కోహ్లీ స్కిప్పర్ గా తప్పుకున్న తర్వాత రోహిత్ శర్మకు ఈ సీరీస్ సవాల్ గా మారనుంది.
వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలి వన్డేకు దూరంగా ఉండగా బుమ్రా, షమీలకు రెస్ట్ ఇచ్చినట్లు ప్రకటించింది సెలక్షన్ కమిటీ.
జడేజా గాయం నుంచి ఇంకా కోలేదని అందుకే పరిశీలించ లేదని పేర్కొంది.
టీ20కి 18 వన్డేకు 18 మందిని ఎంపిక(T20 ODI Teams )చేశామని వెల్లడించింది.
ఇక ప్రకటించిన జట్లు ఇలా ఉన్నాయి. వన్డే టీం రోహిత్ శర్మ కెప్టెన్ కాగా కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ ,
రుతురాజ్, శిఖర్ ధావన్ , కోహ్లీ, సూర్య కుమార్, శ్రేయస్ అయ్యర్, పంత్ , చహర్, ఠాకూర్ , చహల్ , కుల్దీప్ , సుందర్ , సిరాజ్ , ప్రసీద్ , రవి బిష్ణోయ్ , ఆవేఖ్ ఖాన్, దీపక్ హూడా ఉన్నారు.
ఇక టీ20 జట్టుకు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కెప్టెన్, వైస్ కెప్టెన్లు కాగా ఇషాన్ , కోహ్లీ, సూర్య కుమార్ , శ్రేయస్ అయ్యర్,
పంత్, వెంకటేష్ అయ్యర్, దీపక్ , శార్దూల్ , చహల్ , సుందర్ , భువీ, అక్షర్ పటేల్ , సిరాజ్ , హర్షల్ , రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్ ఉన్నారు.
Also Read : మోదీకి జాంటీ రోడ్స్ ధన్యవాదాలు