Ravi Shastri : భారత క్రికెట్ మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సంచలన కామెంట్స్ చేశాడు. భారత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ యూట్యూబ్ చానల్ తో మాట్లాడాడు.
రెండు లేదా మూడు నెలల పాటు కోహ్లీ విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. అదే పనిగా క్రికెట్ ఆడడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొనే చాన్స్ ఎక్కువగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు రవిశాస్త్రి(Ravi Shastri ).
ఇదే సమయంలో ప్రపంచంలోనే టాప్ ప్లేయర్లలో కోహ్లీ ఒకడని, అతడికి ప్రస్తుతానికి రెస్ట్ అవసరమని స్పష్టం చేశాడు. దీని వల్ల వచ్చే మ్యాచ్ లలో అతడు అద్భుతంగా రాణించేందుకు మార్గం ఏర్పడుతుందన్నాడు.
ఎలా ఆడాలో కోహ్లీకి చెప్పాల్సిన పని లేదన్నాడు. ఇప్పటికే అతడు టన్నుల కొద్దీ పరుగులు చేసిన ఘనమైన చరిత్ర కలిగి ఉన్నాడని దాని విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు.
గాడి తప్పిన భారత క్రికెట్ జట్టును గాడిలో పెట్టడంలో తామిద్దరం సక్సెస్ అయ్యామని పేర్కొన్నాడు. ఏ క్రికెటర్ అయినా ఎల్లకాలం పూర్తిగా వంద శాతం ఆడలేడన్న విషయాన్ని గుర్తు పెట్టు కోవాలన్నాడు.
రెస్ట్ అనేది లేకుండా పోవడం వల్లనే కోహ్లీ పూర్తిగా బ్యాటింగ్ పై ఫోకస్ పెట్ట లేక పోతున్నాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం రవిశాస్త్రి (Ravi Shastri )చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
ఇదిలా ఉండగా బీసీసీఐ చీఫ్ గా దాదా వచ్చాక శాస్త్రి, కోహ్లీ తమ పదవుల నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Also Read : ప్లీజ్ ఆ డేట్స్ మార్చండి – శ్రీలంక బోర్డు