N Chandrasekaran : ఇక భ‌విష్య‌త్తు ఎయిర్ ఇండియాదే

టాటా స‌న్స్ గ్రూప్ చీఫ్ చంద్ర‌శేఖ‌ర‌న్

N Chandrasekaran : సుదీర్ఘ కాలం అనంత‌రం మ‌ళ్లీ ఎయిర్ ఇండియా విమాన‌యాన సంస్థ వ్యాపార దిగ్గ‌జ సంస్థ టాటా గ్రూప్ స్వంత‌మైంది. ఈ సంద‌ర్భంగా టాటా స‌న్స్ చీఫ్ చంద్ర‌శేఖ‌ర‌న్ (N Chandrasekaran)మ‌ర్యాద పూర్వ‌కంగా దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో సమావేశం అయ్యారు.

అనంత‌రం ఆయ‌న భావోద్వేగంతో ఎయిర్ ఇండియా కుటుంబ స‌భ్యుల‌కు సుదీర్ఘ లేఖ రాశారు. ఇదిలా ఉండ‌గా టాటా గ్రూప్ న‌కు చెందిన హోల్డింగ్ కంపెనీ టాలేస్ లిమిటెడ్ ఎయిర్ ఇండియాను రూ. 18 వేల కోట్ల‌కు కొనుగోలు చేసింది.

ఈ సంద‌ర్భంగా ప్రియాతి ప్రియ‌మైన ఎయిర్ ఇండియా కుటుంబ స‌భ్యులారా అంటూ సంబోదించారు. ఎయిర్ ఇండియాను ప్ర‌పంచ స్థాయి విమానయాన సంస్థగా తీర్చిదిద్దుతామ‌ని పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా భార‌తీయులంద‌రికీ తాము ఆహ్వానం ప‌లుకుతున్న‌ట్లు తెలిపారు. ఎయిర్ ఇండియా స్వ‌ర్ణ యుగం మున్ముందు ఉంద‌ని తాను న‌మ్ముతున్న‌ట్లు తెలిపారు.

1932లో టాటా ఎయిర్ లైన్స్ పేరుతో జేఆర్డీ టాటా ప్రారంభించారు. ఆ త‌ర్వాత ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుంది. మ‌ళ్లీ టాటా గ్రూప్ స్వంతం చేసుకోవ‌డం విశేషం.

గ‌తంలో ఉత్త‌మ‌మైన వాటిని సంర‌క్షించేందుకు, స్థిర‌మైన మార్పు అవ‌స‌ర‌మ‌ని నేను న‌మ్ముతాను. భ‌విష్య‌త్తును అభివృద్ది చేయ‌డం, స్వీక‌రించ‌డం ద్వారా మ‌నం అద్భుత‌మైన చ‌రిత్ర‌కు నాంది ప‌లుక‌గ‌ల‌మ‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని తెలిపారు చంద్ర‌శేఖ‌ర‌న్(N Chandrasekaran).

మ‌న దేశానికి విమాన‌యాన సంస్థ‌ను నిర్మించేందుకు మ‌నంద‌రం కంక‌ణ‌బ‌ద్దులమై ఉండాల‌ని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండ‌గా టాటా గ్రూప్ తాజాగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ స్పాన్స‌ర్షిప్ తీసుకుంది.

Also Read : బాధ్య‌త‌లు స్వీక‌రించిన విశాల్ గార్గ్

Leave A Reply

Your Email Id will not be published!