Mohammed Shami : మీరు ఇస్తానంటే నేను వ‌ద్దంటానా

టెస్టు కెప్టెన్సీపై మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ

Mohammed Shami  : భార‌త టెస్టు క్రికెట్ స్కిప్ప‌ర్ ప‌ద‌వి మ్యూజిక‌ల్ చైర్ గా మారింది. యూఏఈ వేదిక‌గా జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత కోహ్లీ త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

డిక్లేర్ చేసిన కొన్ని రోజుల్లోనే కోలుకోలేని షాక్ ఇచ్చింది బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ.

ఏకంగా టీ20, వ‌న్డే టీమ్ సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించింది విరాట్ ను.

స‌ఫారీ టూర్ సంద‌ర్భంగా రోహిత్ శ‌ర్మ‌ను ఆ రెండు ఫార్మాట్ ల‌కు కెప్టెన్ గా చేసి కేవ‌లం టెస్టు సీరీస్ కు కోహ్లీని ఉంచింది.

దీంతో రోహిత్ కు గాయం కావ‌డంతో కేఎల్ రాహుల్ తాత్కాలికంగా సార‌థ్యం వ‌హించాడు.

ఇక టెస్టు సీరీస్ 1-2 తేడాతో ఓటమి పాలై సీరీస్ కోల్పోవ‌డంతో ద‌క్షిణాఫ్రికా నుంచి భార‌త్ కు రాకుండానే అక్క‌డి నుంచే తాను కెప్టెన్సీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు కోహ్లీ.

68 టెస్టుల‌కు సార‌థ్యం వ‌హించ‌గా ఇందులో 40కి పైగా టెస్టుల‌కు భార‌త్ విజ‌యాన్ని అందించాడు. 17 మ్యాచ్ లో ఓట‌మి పాలైంది టీమిండియా.

ప్ర‌ధానంగా హెడ్ కోచ్ ర‌వి శాస్త్రి త‌ప్పు కోవ‌డంతో అత‌డి స్థానంలో ది వాల్ గా పేరొందిన రాహుల్ ద్ర‌విడ్ ను ఎంపిక చేసింది బీసీసీఐ. అయినా మార్పు రాలేదు.

ఈ త‌రుణంలో టెస్టు కెప్టెన్సీ రేసులో ఇప్పుడు కేఎల్ రాహుల్, రిష‌బ్ పంత్, జ‌స్ ప్రీత్ బుమ్రా రేసులో ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు.

ఈ త‌రుణంలో త‌న‌కు చాన్స్ ఇస్తే అంత‌కంటే అదృష్టం ఇంకేముంటుంది

అంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు భార‌త స్టార్ పేస‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ(Mohammed Shami ).

ఓ జాతీయ మీడియా చాన‌ల్ తో పిచ్చా పాటి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు భార‌త జ‌ట్టు శిబిరంలో క‌ల‌క‌లం రేపుతున్నాయి.

తాను కూడా రేసులో ఉన్నానంటూ ష‌మీ బ‌హిరంగంగా స్ప‌ష్టం చేయ‌డం విశేషం.

Also Read : సెల‌క్ట‌ర్ల తీరుపై మ‌నోజ్ తివారీ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!