Pushkar Singh Dhami : దైవ భూమిలో ‘ధామీ’ ద‌రువేస్తాడా

ఉత్త‌రాఖండ్ లో అత‌డే సార‌థి

Pushkar Singh Dhami  : దేవుళ్లు న‌డ‌యాడిన ప్రాంతంగా దైవ భూమిగా పేరొందిన ఉత్త‌రాఖండ్ లో రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. వ్యూహాలు ప‌న్న‌డ‌మే కాదు వాటిని ఆచ‌రించ‌డంలో త‌న‌కు తానే సాటి అని నిరూపించుకున్న నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు పుష్క‌ర్ సింగ్ ధామీ.

మాట‌ల తూటాలు పేల్చ‌డ‌మే కాదు ప్ర‌జ‌ల్ని తమ వైపు తిప్పు కోవ‌డంలో త‌న‌కు సాటి రారెవ్వ‌ర‌ని నిరూపించుకున్నారు.

రాజ‌కీయంగా ఎవ‌రిని ఎలా ఎక్క‌డ పెట్టాలో ఎవ‌రిని ఎలా పాయింట్ అవుట్ చేయాలో ధామీకి (Pushkar Singh Dhami )తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలియ‌దు.

స్పాంటేనియ‌స్ గా స్పందించ‌డంలో ధామీ పేరొందారు. రాష్ట్రంలో అత్యంత పిన్న వ‌య‌సులో సీఎంగా కొలువు తీరి రికార్డు సృష్టించారు.

ప్ర‌స్తుతం ఎన్నిక‌ల న‌గారా మోగించింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం.

ప్ర‌ధాన మంత్రి మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ చీఫ్ జేపీ న‌డ్డా స‌హ‌కారంతో దూసుకు వెళుతున్నారు ధామీ.

ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీకి ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరొందిన హ‌రీష్ రావ‌త్ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిగా ఉన్నారు.

రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొన‌సాగుతోంది.

స‌ర్వే సంస్థ‌లు ఇరు పార్టీల‌కు ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్స్ ఉందంటూ పేర్కొనడంతో ధామీ, రావ‌త్ లు స‌ర్వ శ‌క్తులు ఒడ్డుతున్నారు.

ప్ర‌స్తుతం ధామీ ఉత్త‌రాఖండ్ కు సీఎంగా ఉన్నారు. మోదీ బ‌ల‌మైన నాయ‌క‌త్వం దేశాన్ని న‌డిపిస్తుంద‌ని, రాష్ట్రానికి అది ఛోద‌క శ‌క్తిగా ఉప‌యోగ ప‌డుతుంద‌ని ప్ర‌చారంలో ప్ర‌ధానంగా ప్ర‌స్తావిస్తున్నారు ధామీ.

ఆయ‌న సార‌థ్యంలోనే భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎన్నిక‌ల్లో ముందుకు వెళుతోంది. ఇక ధామీ విష‌యానికి వ‌స్తే దైవ భూమికి 10వ సీఎంగా ఉన్నారు. 1975 సెప్టెంబ‌ర్ 16న పుట్టారు.

ఆయ‌న‌కు ఇప్పుడు 46 ఏళ్లు. ఖ‌తిమా నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఆయ‌న నామినేష‌న్ కూడా దాఖ‌లు చేశారు. ఆర్ఎస్ఎస్ నుంచి త‌న ప్ర‌స్థానం ప్రారంభ‌మైంది.

ఏబీవీపీ లో కీల‌కంగా ఉన్నాడు. 2008 వ‌ర‌కు భార‌తీయ జ‌న‌తా యువ మోర్చాకి రాష్ట్ర చీఫ్ గా ప‌ని చేశాడు. బీజేపీలో చెల‌రేగిన అస‌మ్మ‌తి కార‌ణంగా సీఎంగా ఉన్న తీర‌త్ సింగ్ రావ‌త్ గుడ్ బై చెప్ప‌డంతో ధామీకి సీఎంగా ప‌ని చేసే చాన్స్ ద‌క్కింది.

ప్ర‌స్తుత ఎన్నిక‌లు ధామీకి పెను స‌వాల్ గా మారాయి.

Also Read : పంజాబ్ లో టార్చ్ బేర‌ర్ ఎవ‌రో

Leave A Reply

Your Email Id will not be published!