Yogi Adityanath : ఉత్తరప్రదేశ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు యోగి ఆదిత్యానాథ్. ఆయనను ముద్దుగా పిలుచుకునేది మాత్రం యోగి. నిత్యం కాషాయ వస్త్రాలతో దర్శనం ఇచ్చే ఈ లీడర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ప్రస్తుతం ఆయనకు జరుగుతున్న ఎన్నికలు సవాల్ గా మారాయి. ఉత్తర భారతం లోనే కాదు దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతం.
అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగిన రాష్ట్రం యూపీ.
గతంలో జరిగిన ఎన్నికల్లో యోగి సారథ్యంలో బంపర్ మెజారిటీ సాధించి పవర్ లోకి వచ్చింది. ఈసారి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు ఆదిత్యానాథ్.
ఒకానొక సమయంలో యోగిని తప్పించాలని చూసినా సక్సెస్ కాలేక పోయింది బీజేపీ.
ఎందుకంటే ఆయన దమ్మున్న లీడర్ గా , ట్రబుల్ షూటర్ గా, డైనమిక్ నాయకత్వం కలిగిన నాయకుడిగా (Yogi Adityanath )పేరొందారు.
యోగి ఎంపీగా గోరఖ్ పూర్ నుంచి ఎన్నికవుతూ వచ్చారు. తిరుగులేని లీడర్ గా ఎదిగారు.
ఎమ్మెల్సీగా ఎన్నికై ముఖ్యమంత్రిగా కొలువుతీరారు. తనదైన మార్క్ ఉండేలా చేశారు.
జంగిల్, నేరాలకు అడ్డాగా మారిన యూపీలో చుక్కలు చూపించారు.
మిగతా వాటిలో పాలనా పరంగా వైఫల్యం చెందినా యోగికి మాత్రం నేరస్థుల ఆట కట్టించడంలో 100 మార్కులు పడ్డాయి.
తన పేరు చెబితే భయపడే స్థితికి తీసుకు వచ్చాడు. ఒకరకంగా మోస్ట్ సక్సెస్ ఫుల్ గా పేరొందినా రైతులను తొక్కించి చంపిన ఘటన ఆయన హయాంలోనే జరగడం పెద్ద దెబ్బగా మారింది.
ఇక యోగి విషయానికి వస్తే 1972 జూన్ 5న ఉత్తరాఖండ్ లోని పౌరిగడ్వాల్ జిల్లా పాంచూర్ లో రాజ్ పుట్ కుటుంబంలో పుట్టారు. గర్ వాల్ నుంచి డిగ్రీ చదివారు. 26 ఏళ్లకే ఎంపీగా ఎన్నికయ్యారు.
ఈతలోనే కాదు బ్యాడ్మింటన్ లో పట్టు సాధించారు. 1998లో తొలిసారిగా గోరఖ్ పూర్ నుంచి ఎంపికైన చిన్నోడు.
ఇదిలా ఉండగా ఇదే నియోజకవర్గం నుంచి ఏకంగా అయిదుసార్లు అంటే 1998, 1999, 2004, 2014లో ఎన్నికయ్యారు.
గోరఖ్ నాథ్ మఠాధిపతిగా ఉన్నారు. చిన్నప్పటి నుంచి హిందూత్వ సిద్ధాంతాల వైపు ఆకర్షితుడయ్యాడు.
ఇదే సమయంలో బీజేపీలోకి ఎంటర్ అయ్యారు. 44 ఏళ్లకే యూపీకి సీఎంగా ఎంపికై చరిత్ర సృష్టించారు.
ఎంపీగా కంటే హిందూ అతివాదిగా ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చారు. ఇతర మతాల వారిని హిందూవులుగా మార్చడమే తన టార్గెట్ అని బహిరంగంగా ప్రకటించారు యోగి(Yogi Adityanath ).
యూపీకి 21వ ముఖ్యమంత్రిగా ఉన్న ఆదిత్యానాథ్ సారథ్యంలో బీజేపీ ఎన్నికల బరిలో ఉంది. ఆయనకు ఈ ఎలక్షన్స్ సవాల్ గా మారాయి. ఇక్కడ బీజేపీ కంటే యోగి ద్వారానే ముందుకు వెళుతోంది.
Also Read : కాంగ్రెస్ కు అతడే బలం కీలకం