Tamilisai Kcr : మరోసారి హాట్ టాపిక్ గా మారింది తెలంగాణ రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవ కార్యక్రమం. ప్రోటోకాల్ ప్రకారం సీఎంతో పాటు మంత్రులు హాజరు కావాల్సి ఉంది.
హాజరు కాక పోవడంతో రాష్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సీఎం కేసీఆర్(Tamilisai Kcr )కు మధ్య దూరం పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ ల ఎంపిక విషయంలో ప్రభుత్వం పంపించిన ఫైల్ పై సంతకం చేయక పోవడం ఈ దూరాన్ని మరింత పెంచేలా చేసింది.
ఇదే సమయంలో గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించడం, ప్రజల నుంచి నేరుగా వినతులు తీసుకోవడం కూడా మరో కారణంగా ఉంది.
ఇదిలా ఉండగా బీజేపీ ఎంపీపై దాడి జరిగిన ఘటనపై గవర్నర్ ఫోన్ చేసి ఆరా తీసినట్లు సమాచారం. రిపబ్లిక్ డే సందర్భంగా తన ప్రసంగంలో సీఎం పేరు కూడా ఎత్త లేదు గవర్నర్ తమిళిసై.(Tamilisai Kcr )
ఇందులో కేంద్రం, ప్రధానిని మాత్రమే ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కరోనా కారణంగానే సీఎం, మంత్రులు హాజరు కాలేదంటూ వివరణ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.
ఇదిలా ఉండగా దేశంలోని చాలా రాష్ట్రాలలో జరిగిన రిపబ్లిక్ వేడుకలకు సీఎంలు ప్రోటోకాల్ ను పాటించారు. కానీ ఇక్కడ మాత్రం పాటించక పోవడాన్ని విపక్షాలు తప్పు పడుతున్నాయి.
ఒక రకంగా రాజ్యాంగాన్ని అవమానించారంటూ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ఇక రాష్ట్రానికి గవర్నర్ గా వచ్చి రెండేళ్లు అవుతోంది.
ఇప్పటి దాకా ఆమె ఎక్కడా ఎలాంటి ఆరోపణలు కానీ విమర్శలు కానీ చేసిన దాఖలాలు లేవు. గవర్నర్ పదవికి తమిళిసై వన్నె తెచ్చే ప్రయత్నం చేస్తూ వచ్చారు.
సామాన్యులకు గవర్నర్ అందుబాటులో ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో ఇక్కడ సీఎం కంటే ఆమెకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడాన్ని తట్టుకోలేక పోతున్నారంటున్నారు బీజేపీ శ్రేణులు.
అయితే గవర్నర్ బీజేపీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ తటస్తంగా ఉంటూ వచ్చారు. ఇటీవల కొందరిని మార్చినా తమిళిసై పనితీరు ఆధారంగా ఆమెను మార్చేందుకు ఇష్టపడలేదు ప్రధాని మోదీ.
ఆమె సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి వచ్చారు. వృత్తి రీత్యా డాక్టర్. ప్రజల ఇబ్బందులేవో గవర్నర్(Tamilisai Kcr )కు తెలుసు. అందుకనే ఆమెకు పదోన్నతి కూడా ఇచ్చారు. తెలంగాణతో పాటే కాకుండా పుదుచ్చేరికి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్నారు.
Also Read : దైవ భూమిలో ‘ధామీ’ దరువేస్తాడా