Shruti Hasan : సినీ లోకం ‘శ్రుతి’ మంద‌హాసం

భిన్న‌మైన పాత్ర‌ల‌కు పెట్టింది పేరు

Shruti Hasan  : శ్రుతి హాస‌న్ కు ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. భార‌త దేశం గ‌ర్వించ ద‌గిన న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దులు కూతురు. తండ్రి అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం. కానీ ఎక్క‌డా ఆయ‌న పేరు వాడుకోదు.

అలా చెప్పేందుకు ఆమె ఇష్ట‌ప‌డ‌దు. పూర్తిగా స్వ‌తంత్ర వ్య‌క్తిత్వాన్ని ఇష్ట‌ప‌డుతుంది. న‌ట‌నైనా లేదా ఏదైనా స‌రే స్వంతంగా క‌ష్ట‌ప‌డి నేర్చుకోవాలి,

ప్రూవ్ చేసుకోవాలి త‌ప్ప ఇంకొక‌రి పేరుతో ఇలా ఎలా నెట్టుకు వ‌స్తామ‌ని కుండ బ‌ద్ద‌లు కొడుతోంది.

1986 జ‌న‌వ‌రి 28న చెన్నైలో పుట్టారు శ్రుతి హాస‌న్(Shruti Hasan). ఆమెకు ఇప్పుడు 35 ఏళ్లు.

తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో న‌టిగా గుర్తింపు తెచ్చుకున్నారు. న‌టిగానే కాదు గాయ‌ని కూడా. మంచి భావుకురాలు.

మోడ‌ల్ గా ఆ మ‌ధ్య ఓ ప్ర‌క‌ట‌న‌లో న‌టించింది. 2000లో త‌న తండ్రి క‌మ‌ల్ హాస‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తీసిన హే రాం మూవీలో బాల న‌టిగా న‌టించింది. ఆ త‌ర్వాత సంగీతంపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింది.

2008లో సోహం షా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ల‌క్ మూవీలో ఇమ్రాన్ ఖాన్ స‌ర‌స‌న న‌టిగా న‌టించింది. ఆ సినిమా ఫెయిల్ అయింది. ఐర‌న్ లెగ్ అన్న ముద్ర ప‌డింది.

2011లో ద‌ర్శ‌కుడు కె. రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు కె. ప్ర‌కాశ్ ద‌ర్శ‌క‌త్వంలో సిద్దార్త్ స‌ర‌స‌న అన‌గ‌న‌గా ఓ ధీరుడులో న‌టించింది. విమ‌ర్శ‌కుల నుంచి న‌టిగా పేరు తెచ్చుకుంది.

ప‌రాజ‌యం పొందినా ద‌క్షిణ భార‌త ఫిలిం ఫేర్ అవార్డు అందుకుంది ఈ మూవీలో న‌టించినందుకు.

దిల్ తో బ‌చ్చా హైజీ మూవీలో అతిథి పాత్ర‌లో న‌టించింది. ఏ. ఆర్. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య స‌ర‌స‌న త‌మిళ మూవీలో న‌టించింది.

సెవెంత్ సెన్స్ పేరుతో తెలుగులో విడుద‌లై భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. మంచి పేరొచ్చింది.

అవార్డు కూడా ద‌క్కింది. సిద్దార్త్ స‌ర‌స‌న ఓ మై ఫ్రెండ్ మూవీ చేసింది. ధ‌నుష్ స‌ర‌స‌న మూడు చిత్రాల్లో న‌టించింది.

హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో గ‌బ్బ‌ర్ సింగ్ మూవీలో న‌టించింది.

అది బాక్సాఫీస్ బ‌ద్ద‌లు కొట్టింది. శ్రుతి హాస‌న్ (Shruti Hasan)కు మంచి న‌టిగా పేరు తీసుకు వ‌చ్చేలా చేసింది.

ర‌వితేజ స‌ర‌స‌న బ‌లుపు, జూనియ‌ర్ ఎన్టీఆర్ తో రామ‌య్యా వ‌స్తావ‌య్యా లో న‌టించింది.

ఇదే మూవీని ప్ర‌భుదేవా తీసిన హిందీలో న‌టించింది. ప్రిన్స్ మ‌హేష్ బాబుతో క‌లిసి శ్రీ‌మంతుడు మూవీలో నటించి ప్ర‌శంస‌లు అందుకుంది.

2020లో మ‌లినేని గోపిచంద్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ‌తో క‌లిసి న‌టించిన క్రాక్ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా నిలిచింది.

మొత్తంగా రాబోయే రోజుల్లో ఆమె మంచి న‌టిగా పేరు తెచ్చు కోవాల‌ని, మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని కోరుకుందాం.

Also Read : అత‌డో ఆయుధం అత‌డే సైన్యం

Leave A Reply

Your Email Id will not be published!