Brendan Taylor : జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ స్కిప్పర్ బ్రెండన్ టేలర్ కు కోలుకోలేని షాక్ తగిలింది. కొత్త ఏడాది ఆయనకు వచ్చినట్లు లేదు. స్పాట్ ఫిక్సింగ్ విధానాన్ని నివేదించడంలో జాప్యం చేసినందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మూడున్నర ఏళ్ల పాటు నిషేధం విధించింది.
ఈ మేరకు ఐసీసీ అధికారికంగా ఇవాళ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. తాను ఫిక్సింగ్ విషయాన్ని ఎదుర్కొన్నానని ఇటీవలే బ్రెండన్ టేలర్ వెల్లడించాడు. అంగీకరించిన కొద్ది రోజులకే ఐసీసీ ఈ డెసిషన్ తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఒక భారతీయ వ్యాపారవేత్త తనను సంప్రదించడం, ఆయన ఫిక్సింగ్ కు పాల్పడితే డబ్బులు ఇస్తానని ఆశ చూపించడం, కొన్ని డబ్బులు తీసుకున్నట్లు అంగీకరించినట్లు తెలిపాడు టేలర్(Brendan Taylor ).
ఇదే సమయంలో తనకు కొకైన్ ఇచ్చి బ్లాక్ మెయిల్ చేశారంటూ ఆరోపించాడు. ఐసీసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్ట్ తో పాటు అవినీతి నిరోధక కోడ్ ను ఉల్లంఘించినందుకు బ్రెండన్ టేలర్ పై చర్య తీసుకుంటున్నట్లు తెలిపింది.
అతడిపై నాలుగు అభియోగాలతో పాటు డోపింగ్ నిరోధక కోడ్ ను కూడా ఉల్లఘించిందనుకు మరో అభియోగాన్ని అంగీకరించినందుకు బ్రెండన్ టేలర్(Brendan Taylor )పై అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ ల నుంచి మూడున్నర ఏళ్ల పాటు నిషేధం విధించినట్లు ఐసీసీ ప్రకటించింది.
ఇదిలా ఉండగా బ్రెండన్ టేలర్ 2004 నుంచి 2021 వరకు 284 అంతర్జాతీయ మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించాడు. 17 సెంచరీలతో 9 వేల 938 పరుగులు చేశాడు. ఆట పరంగా జింబేబ్వేకు అద్భుతమైన విజయాలు సాధించి పెట్టాడు.
Also Read : రెండు దశల్లో రంజీ ట్రోఫీ