Yuvraj Singh : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వదేశంలో వెస్టిండీస్ తో జరిగే టీ20, వన్డే సీరీస్ కోసం ఎంపిక చేసిన జట్టు కూర్పు బాగుందని పేర్కొన్నాడు. ఇవాళ యువరాజ్ సింగ్ స్పందించాడు.
టీమిండియా పరంగా ఆ నలుగురు ఆటగాళ్లను ఎంపిక చేయడం తనకు సంతోషం కలిగించిందని తెలిపాడు. ఆయా జట్ల కూర్పుపై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు ఈ మాజీ క్రికెటర్.
ఎడమ చేతి వాటం మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ , ఆల్ రౌండర్లు వాషింగ్టన్ సుందర్, దీపక్ హూడా, ఓపెనింగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ లను ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నాడు.
బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మను ప్రత్యేకంగా అభినందించాడు. జట్టులో వీరిని చూడడం బాగుందన్నాడు. గత ఏడాది శ్రీలంక టూర్ లో చివరిసారిగా భారత్ కు ప్రాతినిధ్యం వహించిన కుల్దీప్ గాయం కారణంగా దూరంగా ఉన్నాడు.
ఇటీవలే మోకాలి శస్త్ర చికిత్స అనంతరం కోలుకోవడంతో బీసీసీఐ అతడిని పరిగణలోకి తీసుకుంది. చాహల్ తో కలిసి బౌలింగ్ చేసే చాన్స్ ఉంది. రవి బిష్ణోయ్ కూడా రావడం జట్టుకు అదనపు బలం చేకూర్చుతుందన్నాడు యువరాజ్ సింగ్(Yuvraj Singh).
దీపక్ హూడా హార్ట్ హిట్టింగ్ కు పనికి వస్తాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. వాషింగ్టన్ సుందర్ ను తీసుకోవడం జట్టుకు అడ్వాంటేజ్ అవుతుందని పేర్కొన్నాడు.
మొత్తంగా టీ20, వన్డే జట్లు బలంగా అన్ని ఫార్మాట్ లలో ఆడే సత్తా ఉన్న వాళ్లను ఎంపిక చేయడం ప్రశంసనీయమన్నాడు.
Also Read : బ్రెండన్ టేలర్ పై ఐసీసీ నిషేధం