Supreme Court : భారతదేశ సర్వోన్నత న్యాయ స్థానం మరోసారి ప్రజాస్వామ్యానికి ఉన్న విలువ ఏంటో స్పష్టం చేసింది.
అధికారమే పరమావధిగా మారి పోయిన ప్రస్తుత తరుణంలో ప్రజాప్రతిధులు ఎలా ఉండాలో కూడా వివరించే ప్రయత్నం చేసింది.
ఇది ఆహ్వానించ దగిన పరిణామం అని చెప్పక తప్పదు. చట్ట సభలు అర్ధవంతమైన చర్చలకు వేదికగా ఉండాలే తప్పా వాగ్వావాదాలకు,
వ్యక్తిగత దూషణలకు, కక్షలకు కేరాఫ్ గా మారకూడదని పరోక్షంగా హెచ్చరించింది.
తనపై దాడి చేయబోయారంటూ 12 మంది ఎమ్మెల్యేలపై ఏడాది పాటు రాకుండా నిషేధం విధించిన శాసనసభ సభాపతి నిర్ణయం తీసుకున్నారు
. దానిని సవాల్ చేస్తూ వారంతా సుప్రీంకోర్టు (Supreme Court )మెట్లు ఎక్కారు.
దీనిపై విచారించిన ధర్మాసనం ఆసక్తికరమైన, కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు హుందాగా వ్యవహరించాలి.
అదే సమయంలో తమ బాధ్యతలు ఏమిటో గుర్తుంచు కోవాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వాళ్లు ఇలా గతి తప్పితే ఎలా అని వారికి కూడా చురకలు అంటించింది.
కాగా సభ నుంచి సస్పెండ్ చేస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ ఆదేశాలను సుప్రీంకోర్టు(Supreme Court ) తప్పు పడుతూ కొట్టి వేసింది.
ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్వరూపానికి తీవ్ర విఘాతం కలిగిస్తాయని వ్యాఖ్యానించింది.
ఏడాది పాటు సస్పెండ్ చేయడాన్ని బహిష్కరణను మించిన చర్యగా అభివర్ణించింది జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్ ,
జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సిటీ రవికుమార్ ల బెంచ్. శాసనసభ తీసుకున్న నిర్ణయానికి చట్ట బద్దత లేదంటూ స్పష్టం చేసింది.
సభా కాలానికీ, ఆ తర్వాత కాలనీకి ఎమ్మెల్యేలుగా అన్ని రకాల ప్రయోజనాలు పొందేందుకు వారు అర్హులేనని పేర్కొంది.
పవిత్ర స్థలాలుగా భావించే చట్ట సభలు గతి తప్పడం సరికాదని హెచ్చరించింది.
సభా మర్యాదలు పాటించాలి. అదే సమయంలో ప్రజా సమస్యలను ప్రస్తావించాలి. వాటికి ఆమోద యోగ్యమైన పరిష్కారం కనుగొనేలా చేయాలి.
ప్రజా ప్రతినిధులు విజ్ఞతతో వ్యవహరించాలి. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెంప పెట్టుగా భావించక తప్పదు. ఈ తీర్పు దేశంలోని ప్రజా ప్రతినిధులందరికీ వర్తిస్తుందని గుర్తు పెట్టుకోవాలి.
స్వంత ఇమేజ్ కోసం పాకులాడటం, వ్యక్తిగత ఆస్తులను పెంచు కోవడం పై ఉన్నంత శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంపై పెడితే బావుంటుంది.
Also Read : దైవ భూమిలో ‘ధామీ’ దరువేస్తాడా