Aakash Chopra : కాలం ఎప్పుడూ ఒకే తీరుగా ఉండదు. ప్రత్యేకించి ప్రపంచ క్రికెట్ లో ఎవరు ఎప్పుడు స్టార్ అవుతారో ఇంకెప్పుడు జీరో అవుతారోనని చెప్పలేం.
గత ఏడాది తీవ్ర ఫామ్ లేమితో కొట్టు మిట్టాడి చివరకు అనూహ్యంగా జట్టు నుంచి తప్పు కోవడమే కాదు తప్పించేలా చేసింది సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ఆసిస్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ ను.
కానీ మనోడు టేకిట్ ఈజీగా తీసుకున్నాడు. ఎక్కడా నోరు జారలేదు. చివరకు ఐపీఎల్ లో కూల్ డ్రింక్స్ కూడా మోశాడు. తన జట్టు ఓడిపోతే కంట తడి పెట్టుకున్నాడు.
కానీ యూఏఈ అతడిని స్టార్ ను చేసింది. మరోసారి మెరిసేలా చేసింది. టీ20 వరల్డ్ కప్ లో సత్తా చాటాడు. స్వదేశంలో కూడా దుమ్ము రేపాడు. మొత్తంగా కోల్పోయిన ఫామ్ తిరిగి రావడంతో ఇప్పుడు మూవీస్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.
వరల్డ్ వైడ్ గా క్రికెట్ లో వార్నర్ భయ్యా వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే అతడి మీమ్స్ , వీడియోస్ కు విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఒక్కసారి పోస్ట్ చేశాడంటే లక్షల్లో లైకులు, కామెంట్లు. ఇప్పుడు మనోడు పుష్పరాజ్ అయి పోయాడు.
ఇదే సమయంలో ఈ ఏడాది ఐపీఎల్ మెగా రిచ్ లీగ్ స్టార్ట్ కానుంది. కెప్టెన్ గా ఏ ఫ్రాంచైజీ తీసుకోక పోయినా అన్ని జట్లు మాత్రం వార్నర్ ను తీసుకునేందుకు పోటీ పడడం ఖాయమంటున్నాడు భారత మాజీ క్రికెటర్ ,
ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా(Aakash Chopra ). ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వేలం బెంగళూరులో నిర్వహించేందుకు డిసైడ్ అయ్యింది బీసీసీఐ. మరి ఈ స్టార్ ప్లేయర్ ను ఏ జట్టు దక్కించు కుంటుందోనని ఉత్కంఠ మొదలైంది.
Also Read : రోహిత్ శర్మ సరైన ఆప్షన్ కాదు