Channi : రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు హీరో అవుతారో చెప్పలేం. విపరీతమైన స్వేచ్ఛకు కేరాఫ్ గా మారిన కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఎలా అందలం ఎక్కిస్తుందో అందులో పని చేసే వారికే తెలియదు.
వెన్నుపోట్లు, ఆరోపణలు, విమర్శలు, పదవుల కోసం పోటీ ఎక్కువగా ఆ పార్టీలోనే కనిపిస్తుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవాల్సింది పంజాబ్.
సుదీర్ఘ కాలం పాటు సీఎంగా కొలువు తీరిన కెప్టెన్ అమరీందర్ సింగ్ అనుకోని పరిస్థితుల్లో తప్పు కోవాల్సి వచ్చింది.
అప్పుడు అంతా యాక్టివ్ గా ఉండే పీసీసీ చీఫ్ నవ జ్యోత్ సింగ్ సిద్దూకు చాన్స్ దక్కుతుందని అంతా భావించారు.
కానీ పార్టీ హైకమాండ్ కొత్త పేరును తీసుకు వచ్చింది. ఇలాంటి సర్ ప్రైజ్ లు ఇవ్వడం ఆనాటి దివంగత ప్రధాన మంత్రి
ఇందిరా గాంధీ నుంచి వస్తున్నదే. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీనే కాదు ఏకంగా ప్రజల్ని కూడా విస్తు పోయేలా చేసింది.
ఓ దళిత సామాజిక వర్గానికి చెందిన చరణ్ జిత్ సింగ్ చన్నీకి (Channi)ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది.
ఇది ఒక రకంగా పార్టీకి అడ్వాంటేజ్ గా మారిందని అనుకోవచ్చు.
వచ్చిన అవకాశాన్ని చన్నీ వినియోగించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.
ఓ వైపు ప్రతిపక్షాలు మరో వైపు స్వంత పార్టీ లోనే సిద్దూ నుంచి పోటీ వీటన్నింటిని తట్టుకుని నిలబడ్డారు.
చన్నీ కొలువు తీరిన వెంటనే ప్రజల్లో కలిసేందుకు ఇష్టపడ్డారు. ఆయన మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చారు.
అదే ఆయనను జనం దగ్గరకు వెళ్లేలా చేస్తోంది.
తాను కొలువు తీరి 100 రోజులు పూర్తి కావడంతో 100 రోజులు 100 నిర్ణయాలు పేరుతో ప్రచారం ప్రారంభించారు.
రాష్ట్రంలో 117 సీట్లు ఉన్నాయి. ఎన్నికల నగారా మోగింది.
స్వంత తమ్ముడు ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేశాడు. ఇంకో వైపు మేనల్లుడితో పాటు సహచరులపై ఈడీ దాడి. రూ. 6 కోట్ల నగదు,
విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకోవడం చన్నీని(Channi) ఇబ్బంది పెడుతోంది.
కానీ వీటన్నింటనీ ఆయన తట్టుకుని నిలబడ్డారు. ప్రధాని మోదీ టూర్ సందర్భంగా చోటు చేసుకున్న సెక్యూరిటీ లోపం మరింత ఇబ్బందుల్లోకి నెట్టి వేసింది.
వాటన్నింటిని ఆయన కొట్టి పారేస్తూ ప్రజల్లోకి దూసుకు వెళుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కాంగ్రెస్ కు ఇప్పుడు గట్టి పోటీ ఎదురవుతోంది.
ఈ తరుణంలో ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత చన్నీతో పాటు సిద్దూపై ఉంది. ఆయనకు చదువంటే ఇష్టం. ఇప్పటికి కూడా పిహెచ్ డీ చేస్తున్నారు.
ఎవరి మద్దతు లేకుండానే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. రాష్ట్రంలో కానీ కేంద్ర పార్టీలో కానీ ఆయనకు గాడ్ ఫాదర్ లేరు. ప్రస్తుతం తనను తాను పేదల సీఎంగా(Channi) చూడాలని యత్నిస్తున్నారు.
ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు పీజీలు చేశారు. ఎంబీఏ, ఎల్ఎల్బీ కూడా చదివారు చన్నీ.
2016లో సీఎల్పీ నేతగా ఉన్నారు. 2007లో ఇండిపెండెంట్ గా చంకూర్ సాహిబ్ నుంచి ఎన్నికయ్యారు.
2012, 2015 లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 2017లో మూడోసారి గెలిచి రికార్డు సృష్టించారు.
కెప్టెన్ కేబినెట్ లో సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా పని చేశారు.
2021 సెప్టెంబర్ లో అమరీందర్ రాజీనామాతో సీఎంగా కొలువుతీరి తొలి దళిత సీఎంగా చరిత్ర లిఖించారు.
పంజాబ్ లో 32 శాతం దళిత ఓటు బ్యాంకు ఉండడంతో చన్నీకి(Channi) చాన్స్ దక్కింది.
చన్నీ గెలిపిస్తాడా సిద్దూ రాణిస్తాడా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read : ఈ దూరం ఇంకెంత కాలం