Mahatma Gandhi : సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఆయన పేరు కలకలం నిలిచే ఉంటుంది. హింస ఎప్పటికీ ఆమోద యోగ్యం కాదని శాంతి ఒక్కటే అంతిమ పరిష్కారమని ఆచరణలో చాటి చెప్పిన మహోన్నతమైన దార్శనికుడు మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ(Mahatma Gandhi ).
యావత్ భారత జాతి మొత్తం ఆయనను జాతిపితగా, మహాత్ముడిగా కొలుస్తూ వస్తున్నారు.
తన జీవిత కాలమంతా శాంతి కోసం ప్రయత్నం చేసిన గాంధీ చివరకు హత్యకు గురయ్యాడు.
మహాత్ముడు చనిపోతూ కూడా హే రామ్ అంటూ ప్రాణాలు వదిలారు. గాంధీ ఈ దేశం పట్ల, ఈ మట్టిపట్ల ఎంతో ప్రేమ.
అభిమానం కూడా. నాథురామ్ గాడ్సే తుపాకీ గుళ్లకు బలై పోయిన ఆ మహోన్నత మానవుడు కన్ను మూసిన రోజు ఇదే.
1948 జనవరి 30. ఇవాళ్టితో 78 ఏళ్లు అవుతోంది గాంధీ ఈ లోకాన్ని వీడి. కానీ భారత దేశాన్నే కాదు ప్రపంచాన్ని జాతిపిత ప్రభావం చూపుతున్నారు.
కోట్లాది మంది ప్రజలనే కాదు ప్రపంచాన్ని ప్రభావితం చేసే నాయకులను, దేశాధినేతలను అత్యంత ప్రభావితం చేస్తున్నారు.
అమెరికాకు చెందిన ప్రసిద్ద టైమ్ మేగజైన్ ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన నాయకుడిగా మహాత్ముడిని(Mahatma Gandhi )పేర్కొంది.
గాంధీ శాంతి బోధనలే తనను చంపేందుకు ప్రోత్సహించడం విచారకరం. బాధాకరం కూడా. ఐదు సార్లు దాడి చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఇవాళ ఆయన వర్దంతి. ప్రతి ఏటా అమర వీరుల దినోత్సవం లేదా షహీద్ దివస్ గా జరుపుకుంటోంది దేశం.
దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమర యోధులకు నివాళులు అర్పించేకు దీనిని పాటిస్తారు.
1869 అక్టోబర్ 2 గుజరాత్ లోని పోరుబందర్ లో పుట్టారు. ఇంగ్లండ్ లో ఉన్నత విద్య అభ్యసించారు. అక్కడ ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా పోరాడారు.
అహింస అనే ఆయుధంతో దేశ విముక్తి కోసం పాటు పడ్డాడు. గాంధీని బాపు అని కూడా పిలుస్తారు. ఆయన ఆదర్శాలు ప్రపంచ వ్యాప్తంగా అనుసరించేలా చేశాయి.
నా జీవితమే నా సందేశం అని ప్రకటించారు. సత్యం, ధర్మం, అహింస గాంధీ బోధించిన విలువలు. దేశ విభజనకు గాంధీనే కారణమంటూ గాడ్సే కాల్చి చంపాడు.
Also Read : అరుదైన అవకాశం నిలబెట్టుకునేనా అధికారం