World Giants : వ‌ర‌ల్డ్ జెయింట్స్ ‘లెజెండ్స్’ ఛాంపియ‌న్

ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిన అండ‌ర్స‌న్

World Giants : ప్ర‌పంచ క్రికెట్ లో మొట్ట మొద‌టిసారి నిర్వహించిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఛాంపియ‌న్ గా వ‌ర‌ల్డ్ జెయింట్స్(World Giants) నిలిచింది. ఒమెన్ వేదిక‌గా ఆసియా ల‌య‌న్స్ తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ లో వ‌ర‌ల్డ్ జెయింట్స్ 25 ప‌రుగుల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ సాధించింది.

మ్యాచ్ ప‌రంగా చూస్తే కేవిన్ పీట‌ర్స‌న్ , కోరి అండ‌ర్స‌న్ అద్భుతంగా ఆడాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ బ్యాటింగ్ సెలెక్టు చేసుకుంది వ‌ర‌ల్డ్ జెయింట్స్ . నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 5 వికెట్లు మాత్ర‌మే కోల్పోయింది.

ఏకంగా 256 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. వ‌ర‌ల్డ్ జెయింట్స్ త‌ర‌పున బ్యాట‌ర్ అండ‌ర్స‌న్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. 48 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న ఈ స్టార్ మాజీ ప్లేయ‌ర్ ఏకంగా 93 ప‌రుగులు చేశాడు.

ఇందులో 8 సిక్స్ లు, 7 ఫోర్లు ఉన్నాయి. చేసిన ప‌రుగుల్లో సిక్స్ లు, ఫోర్ల‌తోనే 76 ప‌రుగులు వ‌చ్చాయి. అంటే ఎంత స్పీడ్ గా ఆడాడో అర్థం చేసుకోవ‌చ్చు. వ‌ర్ద‌మాన ఆట‌గాళ్లు విస్తు పోయేలా ఆడాడు అండ‌ర్స‌న్.

ఇక అండ‌ర్స‌న్ తో పాటు పీట‌ర్స‌న్ 48 ప‌రుగులు చేస్తే బ్రాడ్ హాడిన్ 37, డేర‌న్ సామీ 38 ప‌రుగులతో రాణించారు. ఇక భారీ టార్గెట్ 257 ప‌రుగుల‌ను ఛేజ్ చేసే ప్ర‌య‌త్నంలో బ‌రిలోకి దిగిన ఆసియా ల‌య‌న్స్ రాణించ లేక పోయింది.

శ్రీ‌లంక మాజీ బ్యాట‌ర్ స‌న‌త్ జ‌యసూర్య 38, మ‌హ్మ‌ద్ యూసుఫ్ 39 ప‌రుగులు, దిల్షాన్ 25 ప‌రుగుల‌తో రాణించారు. మిగ‌తా వారు అంత‌గా ఆక‌ట్టుకోలేక పోయారు.

మొత్తంగా వ‌ర‌ల్డ్ జెయింట్స్ విజేత‌గా నిల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించిన అండ‌ర్స‌న్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ద‌క్కింది.

Also Read : ఐపీఎల్ వేలంలో వార్న‌ర్ దే హ‌వా

Leave A Reply

Your Email Id will not be published!