Shoaib Akhtar : ఇప్పుడైతే ల‌క్ష ప‌రుగులు చేసే ఛాన్స్

ల‌క్ష ప‌రుగులు చేసి ఉండేవాడు

Shoaib Akhtar : పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్, రావిల్పిండి ఎక్స్ ప్రెస్ గా పేరొందిన షోయ‌బ్ అక్త‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు, భార‌త మాజీ క్రికెట‌ర్ స‌చిన్ ర‌మేష్ టెండూల్క‌ర్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించాడు.

ఇప్పుడున్న కొత్త రూల్స్ ప్ర‌కారం ఆడితే గ‌నుక స‌చిన్ క‌నీసం ల‌క్ష పరుగులు చేసి ఉండేవాడ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశాడు. గ‌తంలో ఉన్న రూల్స్ కు ఇప్ప‌టికీ చాలా తేడా ఉంద‌న్నాడు.

ఈ స‌మ‌యంలో గ‌నుక స‌చిన్ ఆడి ఉండి ఉంటే ట‌న్నుల కొద్దీ ప‌రుగులు సాధించి ఉండే వాడ‌న్నాడు షోయ‌బ్ అక్త‌ర్(Shoaib Akhtar). ఇదిలా ఉండ‌గా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ లో స‌చిన్ టెండూల్క‌ర్ ఏకంగా 34 వేల 357 ప‌రుగులు చేశాడు.

అన్ని ఫార్మ‌ట్ ల‌లో అత్య‌ధిక ర‌న్స్ చేసిన క్రికెట‌ర్ గా రికార్డు సృష్టించాడు. అన్ని ఫార్మాట్ లు క‌లిపి 100 సెంచ‌రీలు, 164 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఐసీసీ క్రికెట్ కు సంబంధించి పెను మార్పులు తీసుకు వ‌చ్చింద‌న్నాడు.

ప్ర‌స్తుతం ఉన్న నియ‌మ నిబంధ‌న‌ల మేర‌కు చూస్తే బ్యాట‌ర్ లు ఎక్కువ‌గా ప‌రుగులు చేసేందుకు వీలు క‌లుగుతుంద‌న్నాడు. ఈ విష‌యాన్ని తాజాగా షోయ‌బ్ అక్త‌ర్(Shoaib Akhtar) త‌న యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా అభిప్రాయం పంచుకున్నాడు.

స‌చిన్ టెండూల్క‌ర్ అద్భుత‌మైన ప్లేయ‌ర్. ఆనాటి కాలంలో టాప్ పేస‌ర్ల‌ను ఎదుర్కొన్నాడ‌ని కితాబు ఇచ్చాడు. త‌న‌తో పాటు వ‌సీమ్ అక్ర‌మ్ , వ‌కార్ యూనిస్ , షేన్ వార్న్ , బ్రెట్ లీ లాంటి దిగ్గ‌జ బౌల‌ర్ల‌ను ఎదుర్కొన్నాడ‌ని పేర్కొన్నాడు. అక్త‌ర్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

Also Read : ఐపీఎల్ వేలంలో వార్న‌ర్ దే హ‌వా

Leave A Reply

Your Email Id will not be published!