Ian Chappell : ఆసిస్ మాజీ క్రికెట్ దిగ్గజం, మాజీ భారత క్రికెట్ జట్టు కోచ్ ఇయాన్ చాపెల్ సంచలన కామెంట్స్ చేశాడు. ఇటీవలే భారత జట్టు టెస్టు కెప్టెన్సీ పదని నుంచి తప్పుకున్న కోహ్లీ అద్భుతమైన, విజయవంతమైన స్కిప్పర్ అంటూ కితాబు ఇచ్చాడు.
అదే సమయంలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ పై నిప్పులు చెరిగాడు. అతడికి నాయకుడిగా ఉండాల్సిన లక్షణాలు లేవన్నాడు. కోహ్లీని ఆకాశానికి ఎత్తేశాడు చాపెల్. అతను భారత జట్టును ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లాడని పేర్కొన్నాడు.
జో రూట్ మంచి బ్యాటర్ కానీ పేలవమైన స్కిప్పర్ అంటూ ఫైర్ అయ్యాడు. ఇదిలా ఉండగా బీసీసీఐ సెలెక్షన్ కమిటీ టీ20, వన్డే మ్యాచ్ లకు కోహ్లీని కెప్టెన్సీ పదవి నుంచి తప్పించింది.
అతడి స్థానంలో రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించింది. ఇదే సమయంలో సఫారీ టూర్ లో భారత్ 1-2 తేడాతో టెస్టు సీరీస్ కోల్పోవడంతో తాను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు కోహ్లీ.
ఈ నిర్ణయం ప్రపంచ క్రికెట్ లో కలకలం రేపింది. బీసీసీఐతో ఉన్న విభేదాల కారణంగానే తప్పుకున్నాడన్న ఆరోపణలు వచ్చాయి. వీటిని కాదనలేమంటూ మాజీ ఆటగాళ్లు కామెంట్ చేయడం చర్చకు దారితీసింది.
ఈ తరుణంలో కోహ్లీ నిర్ణయం తన వ్యక్తిగతమని కానీ తాను చూసిన ఆయా జట్ల కెప్టన్లలో కోహ్లీ అద్భుతమైన ప్రతిభా పాటవాలు, నాయకత్వం కలిగిన గొప్ప క్రికెటర్ అంటూ ప్రశంసించాడు ఇయాన్ చాపెల్(Ian Chappell).
సామాన్యంగా చాపెల్ ఎవరినీ పొగడడు. ఆయన భారత జట్టుకు కూడా కోచ్ గా ఉన్నాడు.
Also Read : వెస్టిండీస్ కు గెలిచే ఛాన్స్