Team India ODI : చ‌రిత్ర సృష్టించ‌నున్న టీమిండియా

ఫిబ్ర‌వ‌రి 6న 1000వ వ‌న్డే ఆడ‌నున్న భార‌త్

Team India ODI : ప్ర‌పంచ క్రికెట్ చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ క‌లిగి ఉంది భార‌త క్రికెట్ జ‌ట్టు. ఎంద‌రో అద్భుత‌మైన ఆట‌గాళ్లు క్రికెట్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. త‌మ‌దైన ఆట తీరుతో ఆక‌ట్టుకుంటున్నారు.

దిగ్గ‌జ ఆట‌గాళ్లు ఎన‌లేని విజ‌యాలు అందించారు. అద్భుత‌మైన రికార్డులు నెల‌కొల్పారు. అత్య‌ధిక గెలుపుల‌తో త‌మ‌కంటూ ప్రాధాన్య‌త సంత‌రించుకున్నారు.

ఈ త‌రుణంలో టీమిండియా అరుదైన ఘ‌న‌త‌కు నాంది ప‌ల‌క‌బోతోంది. అదేమిటంటే ఫిబ్ర‌వ‌రి 6న మోతేరా వేదిక‌గా వెస్టిండీస్ తో జ‌రిగే తొలి వ‌న్డే మ్యాచ్ తో టీమిండియా(Team India ODI) రికార్డు సృష్టించ నుంది.

క్రికెట్ ఆట ప‌రంగా ఏ టీమ్ కు సాధ్యం కాని ఫీట్ సాధించేందుకు రెడీ అవుతోంది. ఆ మ్యాచ్ తో భార‌త జ‌ట్టు త‌న కెరీర్ లో 1000వ మ్యాచ్ ఆడ‌నుంది. ఇది ప్ర‌పంచ క్రికెట్ లో ఏ జ‌ట్టుకు సాధ్యం కాక పోవ‌డం విశేషం.

క్రికెట్ హిస్ట‌రీ ప‌రంగా చూసుకుంటే ఎన్నో ఫార్మాట్ లు వ‌చ్చాయి. కానీ మొద‌ట టెస్టుల‌తో ప్రారంభ‌మైంది. ఆ త‌ర్వాత వ‌న్డేలు, టీ20, టీ10లు వ‌చ్చాయి. టెక్నాల‌జీ మారింది. ఆట తీరులో కూడా మార్పులు వ‌చ్చాయి.

అంతే కాదు ప్ర‌పంచ క్రికెట్ ను పూర్తిగా భార‌త్ శాసిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ క్రికెట్ బోర్డుకు లేనంతటి ఆదాయం బీసీసీఐకి ఉంది. దాని ఆస్తులు 50 వేల కోట్ల‌కు పైమాటేన‌ని అంచ‌నా.

ఇక విష‌యానికి వ‌స్తే టీమిండియా ఇప్ప‌టి దాకా 999 మ్యాచ్ లు ఆడింది. ఇందులో 518 మ్యాచ్ లలో గెలుపొందింది. 431 మ్యాచ్ ల‌లో ఓడి పోయింది.

భార‌త్ త‌ర్వాతి స్థానాల్లో ఆసిస్ 958, పాకిస్తాన్ 936, లంక 870, విండీస్ 834, కీవీస్ 775, ఇంగ్లండ్ 761, సౌతాఫ్రికా 638, జింబాబ్వే 541, బంగ్లా 388 మ్యాచ్ లు ఆడాయి.

Also Read : ఇప్పుడైతే ల‌క్ష ప‌రుగులు చేసే ఛాన్స్

Leave A Reply

Your Email Id will not be published!