Ajit Agarkar : భారత క్రికెట్ జట్టు మాజీ పేసర్ అజిత్ అగార్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఫామ్ పై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాగైతే భారత జట్టుకు ఇబ్బంది కలిగించే అంశమని పేర్కొన్నాడు.
గతంలో ఉన్నంత దూకుడు ఇప్పుడు కోహ్లీకి లేకుండా పోయిందన్నారు. కోహ్లీ కొంత కాలం నుంచి సరిగా ఆడడం లేదన్నాడు. విరాట్ ఆడిన ప్రతిసారీ భారత జట్టు అద్భుత విజయాలు సాధించిందని పేర్కొన్నాడు.
స్వదేశంలో జరిగే విండీస్, శ్రీలంక సీరీస్ లలో మరింత రాణించ గలిగితే టీమిండియాకు మేలు జరుగుతుందన్నాడు అజిత్ అగార్కర్(Ajit Agarkar). టీ20, వన్డే, టెస్టు మ్యాచ్ లకు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు కోహ్లీ.
దీంతో ఏడేళ్ల పాటు కెప్టెన్ గా వ్యవహరించిన కోహ్లీ ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమయ్యే సీరీస్ లో కేవలం ఆటగాడిగా మాత్రమే ఆడనున్నాడు. దీంతో అందరి కళ్లు కోహ్లీ పైనే ఉన్నాయి.
అతడు రాణిస్తాడనే నమ్మకాన్ని ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం రికీ పాంటింగ్ కూడా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా అజిత్ అగార్కర్ (Ajit Agarkar)స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్ లో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటగాడు అని అతడి నాయకత్వంలో భారత్ అనేక విజయాలు సాధించిన విషయాన్ని మరిచి పోకూడదన్నారు.
అయితే అతడి నుంచి మ్యాచ్ పరంగా కనీసం 50 నుంచి 60 పరుగులు వస్తే టీంకు టెన్షన్ అంటూ ఉండదని పేర్కొన్నారు అజిత్ అగార్కర్.
Also Read : ‘గిల్’ ను కోల్పోవడం బాధాకరం