Harbhajan Singh : భారత క్రికెట్ మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సంచలన కామెంట్స్ చేశాడు. భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ స్కిప్పర్ మహేంద్ర సింగ్ ధోనీపై కీలక వ్యాఖ్యలు చేశాడు భజ్జీ.
తామిద్దరం ఎన్నో మ్యాచ్ లు ఆడామని కానీ అంత సాన్నిహిత్యం మాత్రం లేదన్నాడు. అయితే తామిద్దరం మంచి స్నేహితులమని పేర్కొన్నాడు. టీమిండియా రెండో ప్రపంచ కప్ విజేత టీమ్ లో కూడా హర్భజన్ సింగ్(Harbhajan Singh )సభ్యుడిగా ఉన్నాడు.
తామిద్దరి మధ్య అంతరం ఉందని వస్తున్న ప్రచారాన్ని కొట్టి పారేశాడు. అందులో వాస్తవం లేదని తామిద్దరం మంచి స్నేహితులమని స్పష్టం చేశాడు. మీడియా అడిగిన ప్రశ్నకు ఆసక్తికర జవాబు ఇచ్చాడు.
మీరు ఏదేదో అడుగుతున్నారు. జట్టులో మేం సభ్యులుగా ఉన్నాం. కెప్టెన్ కొంచెం బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని అంత మాత్రాన మిగతా ఆటగాళ్లు తక్కువ కారని స్పష్టం చేశాడు.
2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో, 2011 లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో ధోనీ నాయకత్వంలో జట్టు మెంబర్ గా ఉన్నాడు హర్భజన్ సింగ్(Harbhajan Singh ). భజ్జీ 31 టెస్టులు, 77 వన్డేలు 25 టీ20 మ్యాచ్ లు ఆడాడు.
ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ ఎంటర్ కావడంతో మనోడికి ప్రయారిటీ తగ్గుతూ వచ్చింది. 2011 తర్వాత తామిద్దరం ఎందుకు కలిసి ఆడ లేదన్న దానికి ఇప్పటికీ కారణం తెలియదన్నాడు హర్బజన్ సింగ్.
అయితే జార్ఖండ్ డైనమెట్ పై తనకు ఎలాంటి ఫిర్యాదులు లేవన్నాడు.
Also Read : రహానే సరైనోడు కోహ్లీ దమ్మున్నోడు