Kieron Pollard : వెస్టిండీస్ టీ20, వన్డే జట్ల కెప్టెన్ కీరన్ పొలార్డ్ సంచలన కామెంట్స్ చేశాడు. స్వదేశంలో ఇంగ్లండ్ లాంటి బలీయమైన టీమ్ నే మట్టి కరిపించామని ఇక సఫారీ చేతిలో చేతులెత్తేసిన భారత జట్టును ఓడించడం తమకు ఓ లెక్కా అంటూ ఏకి పారేశాడు.
ఒక రకంగా ఎద్దేవా చేశాడు. కీరన్ పొలార్డ్ కు భారతతో కొన్నేళ్లుగా అనుబంధం ఉంది. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ – ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు.
దేశంలోని వివిధ మైదానాలలో ఆడిన అనుభవం అతడికి ఉంది. అతడితో పాటు పలువురు ఆటగాళ్లు ఐపీఎల్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ తరుణంలో ఫిబ్రవరి 6 నుంచి భారత్ తో విండీస్ టీ20, వన్డే మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.
దీంతో ఇంగ్లండ్ ను ఓడించిన అనంతరం మీడియాతో మాట్లాడాడు పొలార్డ్(Kieron Pollard ). 5 టీ20 ల సీరీస్ లో భాగంగా 3-2 తేడాతో సీరీస్ కైవసం చేసుకుంది విండీస్.
విచిత్రం ఏమిటంటే రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్న ముంబై ఇండియన్స్ లో పొలార్డ్ ఆటగాడిగా ఉన్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ కెప్టెన్లుగా తలపడ బోతున్నారు.
ఇది ఒక రకంగా ఆసక్తికరంగా కనిపించినప్పటికీ చరిత్ర సృష్టించేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశాడు పొలార్డ్. ఇంగ్లండ్ తో సాధించిన విజయంతో తమలో కొత్త ఉత్సాహం నెలకొందని ఇక టీమిండియాను ఓడించడమే మిగిలి ఉందన్నాడు.
తప్పకుండా గెలుస్తామన్న నమ్మకం తమకు ఉందని ధీమా వ్యక్తం చేశాడు కీరన్ పొలార్డ్.
Also Read : కోహ్లీ ఫామ్ పై అగార్కర్ ఆందోళన