HCA BCCI : ప్రపంచ క్రికెట్ చరిత్రలో భారత క్రికెట్ జట్టుకు ఎనలేని విజయాలు సాధించి పెట్టిన దిగ్గజ ప్లేయర్ గా పేరొందిన మహమ్మద్ అజహరుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు చీఫ్ గా ఉన్నారు.
ఆయన అనుభవం, స్థాయి బీసీసీఐది(HCA BCCI). కానీ వ్యక్తిగత కారణాల రీత్యా అజ్జూ భాయ్ ఇక్కడికే పరిమితం కావడం దారుణం. .
ఇక అసలు విషయానికి వస్తే హైదరాబాద్ కు ఏమైంది. మన స్థానం ఎక్కడుంది.
భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఇక్కడి వాడే. రాయుడు హెచ్ సీఏపై బాంబు పేల్చి చెన్నై సూపర్ కింగ్స్ కు వెళ్లి పోయాడు.
ఒక రకంగా తన కెరీర్ పాడు చేసుకున్నాడనే చెప్పక తప్పదు.
అజహరుద్దీన్ ఉండీ కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రతి ఏటా ఇండియన్ ప్రిమీయర్ లీగ్ – ఐపీఎల్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ నిర్వహిస్తూ వస్తోంది.
ఈ ఏడాది దేశంలో ఆరు మైదానాలను ఎంపిక చేసింది. ఎలాంటి వసతి సౌకర్యాలు లేక పోయినా బీసీసీఐ ముంబై స్టేడియంను ఎంపిక చేసింది.
కరోనా కేసులు అత్యధికంగా మరాఠా లోనే ఉన్నాయి.
దేశంలోనే అత్యున్నతమైన మెట్రో నగరాలలో హైదరాబాద్ టాప్ ఉంది. క
రోనా కేసులు కూడా ఇక్కడ తక్కువగా నమోదవుతున్నా బీసీసీఐ ఈ నగరాన్ని ఎంపిక చేయలేదు.
లాల్ బహదూర్ స్టేడియంతో పాటు ఉప్పల్, జింఖానా స్టేడియంలు ఉన్నాయి. అజహరుద్దీన్ కెప్టెన్ గా ఉన్న సమయంలోనే సౌరవ్ గంగూలీ ఓ వెలుగు వెలిగాడు.
అతడి సపోర్ట్ ఎంతగానో ఉంది. జస్ట్ ఒక్క మాట అజ్జూ భాయ్ చెపితే చాలు ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్ నిర్వహించేందుకు పెద్ద ఆటంకం ఏర్పడదు.
ఇప్పటికే సవాలక్ష ఆరోపణలు, అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.
ప్రభుత్వ పరంగా గతంలోనే మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశాడు. కానీ బీసీసీఐ పట్టించు కోలేదు.
ఇకనైనా వివక్షను పక్కన పెట్టి హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించేలా చూస్తే బాగుంటుందని క్రీడాభిమానులు కోరుతున్నారు.
ఇప్పటికైనా అజహరుద్దీన్ పునరాలోచించు కోవాలి. తన పవర్ ను ఉపయోగించి హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించేలా ప్రయత్నం చేయాలి.
లేక పోతే తనపై ఉన్న అభిమానం లేకుండా పోతుందని గమనించాలి.
Also Read : కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే కష్టం