Gautam Gambhir : ఆల్ రౌండర్ కంటే ఆటపై ఫోకస్ పెట్టండి
నిప్పులు చెరిగిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్
Gautam Gambhir : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ సంచలన కామెంట్స్ చేశారు. కపిల్ దేవ్ లాంటి ఆల్ రౌండర్ కోసం వెతకడం మానేసి రాబోయే సీరీస్ లలో సత్తా చాటేందుకు ఆటపై ఫోకస్ పెట్టాలని సూచించాడు.
ఇప్పటికే దక్షిణాఫ్రికా టూర్ లో ఉన్న పరువు పోగొట్టుకుని వచ్చారని ఇక ఎలా గెలిచేందుకు ఏం చేయాలో ఆలోచిస్తే బెటర్ అని పేర్కొన్నాడు.
ఇంకో వైపు కపిల్ దేవ్ లాంటి నిఖార్సైన ఆల్ రౌండర్ కు వారిని తీర్చిదిద్దే చాన్స్ ఇస్తే బెటర్ అని మాజీ ఆటగాళ్లు అభిప్రాయ పడుతున్నారు.
ఇదే సమయంలో కొత్తగా కోచ్ గా కొలువు తీరిన రాహుల్ ద్రవిడ్ తీవ్ర వత్తిడికి లోనవుతున్నాడు. సఫారీ టూర్ లో భాగంగా టెస్టు కెప్టెన్ గా ఉన్న కోహ్లీ ఉన్నట్టుండి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
దీంతో తదుపరి టెస్టు సారథి ఎవరనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, మహమ్మద్ షఫీ, రిషబ్ పంత్ , జస్ ప్రీత్ బుమ్రా లాంటి వాళ్ల పేర్లను పరిశీలిస్తోంది భారత సెలక్టర్ల ఎంపిక కమిటీ.
ఈనెల 6 నుంచి విండీస్ తో టీ20, వన్డే మ్యాచ్ ల సీరీస్ లు ప్రారంభం కానున్నాయి. అటు వన్డే, ఇటు టెస్టు సీరీస్ కోల్పోయిన టీమిండియా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది.
మనోళ్లకు ఆటపై కంటే ఐపీఎల్ పై మోజు ఎక్కువైందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో గంభీర్(Gautam Gambhir) చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
జట్టులో లేని వారి కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేయాలో చూడాలని బీసీసీఐకి చురకలు అంటించాడు.
Also Read : మేం పులులం మీరు పిల్లులు