Mohammed Siraj : హైదరాబాద్ అంటేనే క్రికెట్ లో ఎందరో అద్భుతంగా రాణించారు. శివలాల్ యాదవ్, మహమ్మద్ అజహరుద్దీన్ , అర్హద్ అయూబ్, వెంకటపతి రాజు, వీవీఎస్ లక్ష్మణ్, రాయుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో క్రికెటర్లు పరిపుష్టం చేశారు.
ఇండియన్ ప్రిమీయర్ లీగ్ – ఐపీఎల్ పుణ్యమా అని కుర్రాళ్లు అద్భుతమైన ప్రతిభా పాటవాలతో దుమ్ము రేపుతున్నారు. సత్తా చాటుతున్నారు.
భారత క్రికెట్ జట్టుకు సారథ్యం వహించి ప్రపంచ వ్యాప్తంగా తన మణికట్టు మాయజాలంతో మెస్మరైజ్ చేసిన అజహరుద్దీన్ కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన వాడే.
తాజాగా ఓ ఆటోడ్రైవర్ కొడుకు ఇవాళ స్టార్ పేసర్ గా వరల్డ్ వైడ్ గా ఎదగడం మామూలు విషయం కాదు. అతడే మహ్మద్ సిరాజ్(Mohammed Siraj ). ప్రస్తుతం టీమిండియాలో కీలక ఆటగాడిగా మారాడు.
తన తండ్రి పడ్డ కష్టం అతడిని ఇవాళ దేశం ప్రేమించే ప్లేయర్ గా చేసింది. ఇదే సమయంలో 2017లో సన్ రైజర్స్ హైదరాబాద్ సిరాజ్ ను కొనుగోలు చేసింది.
కానీ మనోడికి భారీ ప్రచారం లభించింది మాత్రం 2018లోనే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిరాజ్ ను తీసుకున్న తర్వాత సిరాజ్ (Mohammed Siraj )దశ మారి పోయింది. ఆనాటి నుంచి నేటి దాకా అతడి సక్సెస్ కొనసాగుతూనే ఉంది.
కానీ తను మాత్రం గతం మర్చి పోక పోవడం సిరాజ్ కు ఉన్న స్పెషాలిటీ. తాజాగా ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఆర్సీబీ సిరాజ్ ను రూ. 7 కోట్లకు రిటైన్ చేసుకుంది.
ఈ సందర్భంగా ఆర్సీబీ పాడ్ కాస్ట్ రిలీజ్ చేసింది. ఐఫోన్ , సెకండ్ హ్యాండ్ కారు కొన్నానని చెప్పాడు సిరాజ్.
Also Read : ఇప్పుడు ఆట పైనే ఫోకస్ పెట్టా