IPL BCCI : ఐపీఎల్ వేలానికి వేళాయె

590 క్రికెట‌ర్లు ఆక్ష‌న్ కు సిద్దం

IPL BCCI  : భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి – బీసీసీఐ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ఈ ఏడాది నిర్వ‌హించే ఐపీఎల్(IPL BCCI )మెగా రిచ్ లీగ్ కు సంబంధించి ఆట‌గాళ్ల వేలానికి ఇప్ప‌టికే డేట్స్ ఫిక్స్ చేసింది.

విధి విధానాలు కూడా రూపొందించింది. ఈ నెల 12, 13 తేదీల‌లో బెంగ‌ళూరు వేదిక‌గా ఈ వేలాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది బీసీసీఐ.

ఇదిలా ఉండ‌గా ఈసారి మెగా వేలంలో పాల్గొనేందుకు మొత్తం 1214 మంది ఆట‌గాళ్లు ప్ర‌పంచ వ్యాప్తంగా ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిని షార్ట్ లిస్ట్ చేసింది బీసీసీఐ.

ఈ విష‌యాన్ని ఇవాళ అధికారికంగా ప్ర‌క‌టించింది. వ‌చ్చిన వాటిలో జ‌ల్లెడ ప‌డితే చివ‌ర‌కు 590 మంది క్రికెట‌ర్లు మిగిలార‌ని వెల్ల‌డించింది. ఇందులో 228 క్యాప్డ్ ప్లేయ‌ర్లు ఉన్నారు.

మ‌రో 355 మంది అన్ క్యాప్డ్ ప్లేయ‌ర్లు ఉండ‌గా ఏడు మంది అసోసియేట్ దేశాల‌కు చెందిన ఆట‌గాళ్లను ప‌రిశీలించ‌డం జ‌రుగుతుంద‌ని బీసీసీఐ తెలిపింది.

భార‌త జ‌ట్టు నుంచి శ్రేయాస్ అయ్య‌ర్, ధావ‌న్ , ష‌మీ, ఇషాన్ కిష‌న్ , ర‌హానే, రైనా, చ‌హ‌ల్, సుంద‌ర్ , ఠాకూర్ , దీప‌క్ చ‌హ‌ర్, ఇషాంత్ శ‌ర్మ‌, ఉమేష్ యాద‌వ్ , త‌దిత‌ర ఆట‌గాళ్లు స్టార్ ఆట‌గాళ్ల రేసులో (IPL BCCI )ఉండ‌డం విశేషం.

ఇక దేశాల ప‌రంగా చూస్తే ఆఫ్గ‌న్ నుంచి 17 మంది ప్లేయ‌ర్లు వేలంలో ఉండ‌గా ఆసిస్ నుంచి 47, బంగ్లా నుంచి 5, ఇంగ్లండ్ నుంచి 24, ఐర్లాండ్ నుంచి 5, న్యూజిలాండ్ నుంచి 24, స‌ఫారీ నుంచి 33 , లంక నుంచి 23, విండీ నుంచి 34 మంది ఉన్నారు.

ఇక న‌మీబియా నుంచి 3, నేపాల్ , స్కాట్లాండ్ నుంచి ఒక్క‌రొక్క‌రు ఉన్నారు. చాలా మంది ఆట‌గాళ్లు త‌మ క‌నీస ధ‌ర కోటిన్న‌ర నుంచి రూ. 2 కోట్ల‌కు పేర్కొన్నారు.

Also Read : నిన్న ఇంగ్లండ్ నేడు భార‌త్ వంతు

Leave A Reply

Your Email Id will not be published!