IPL 2022 Auction : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ – ఐపీఎల్ సందడి మొదలైంది. ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ ఐపీఎల్ (IPL 2022 Auction)మెగా వేలానికి శ్రీకారం చుట్టింది.
ఈనెల బెంగళూరు వేదికగా 12, 13 తేదీలలో ఆక్షన్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్టు చేసింది. వేలానికి సంబంధించి మొత్తం 590 క్రికెటర్లను ఫైనల్ చేసింది బీసీసీఐ. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటించింది.
ఇదిలా ఉండగా ఈసారి ఐపీఎల్ ను ఇండియా లోనే నిర్వహించేందుకు నిర్ణయించింది. ఐపీఎల్ (IPL 2022 Auction)మెగా వేలానికి సంబంధించి కనీస ధర రూ. 2 కోట్లు, కోటిన్నర కోట్ చేశారు క్రికెటర్లు. ఇక రూ. 2 కోట్ల కనీస విలువతో 48 మంది క్రికెటర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
అయితే ఈ వేలం పాటలో ఇరు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి మొత్తం 23 మంది పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి 8 మంది ఉన్నారు.
వీరిలో అంబటి రాయుడు, అశ్విన్ హెబర్ , రికీ భుయ్, హరి శంకర్ రెడ్డి, పృథ్వీరాజ్ , స్టీఫెన్ , బండారు, గిరినాథ్ రెడ్డి ఉన్నారు.
ఇక భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ – హెచ్ సీఏ నుంచి 15 మంది వేలం పాటకు రెడీ అయ్యారు.
వీరిలో విహారీ, తిలక్ వర్మ, సందీప్ , తన్మయ్ , తనయ్ , మిలింద్, రాహుల్ బుద్ది, యుధ్ వీర్ , కార్తికేయ, భగత్ వర్మ, రక్షణ్ రెడ్డి, మనీశ్ రెడ్డి, అజయ్ , మికిల్ , అఫ్రిదీ తమ లక్ పరీక్షించు కునేందుకు వేచి చూస్తున్నారు.
Also Read : నిన్న ఇంగ్లండ్ నేడు భారత్ వంతు