KCR MODI : తెలంగాణలో ఎన్నికలు లేక పోయినప్పటికీ టీఆర్ఎస్, బీజేపీల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో మాటల యుద్దం కొనసాగుతోంది. గత కొంత కాలం నుంచీ ఇరు పార్టీలు పెద్ద ఎత్తున ఆరోపణల పర్వానికి తెర తీశారు.
వ్యక్తిగత దూషణలు మరింత పెరిగాయి. సాక్షాత్తు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ వేదికగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
ప్రధానంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర సర్కార్ ను , బీజేపీని, ఆర్థిక మంత్రిని లక్ష్యంగా చేసుకుని నిప్పులు కురిపించారు.
ఈ తరుణంలో మోదీ (KCR MODI )వేష ధారణపై చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి.
పైన పటారం లోన లొటారం అన్న అర్థం వచ్చేలా ఓ సామెత కూడా ఉర్దూలో చెప్పారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో కేసీఆర్ ఈసారి వ్యక్తిగత విమర్శలకు దిగడం కొంత విస్తు పోయేలా చేసింది.
దుస్తులు మారుస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు కేసీఆర్(KCR MODI ). అంతే కాదు ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు.
వేష, భాషల్ని కించ పరుస్తూ మాట్లాడటాన్ని బీజేపీ శ్రేణులు తప్పు పడుతున్నాయి.
ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మోదీపై ఇలాగేనా ఒక సీఎం మాట్లాడేది అంటూ మండి పడుతున్నారు.
ఇదే సమయంలో ఎన్నికలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ ఎన్నికల కోసం వేషధారణలు వేస్తారంటూ కామెంట్ చేశారు కేసీఆర్.
గుజరాత్ మోడల్ పనికిమాలిన మోడల్ అంటూ ఆరోపించారు.
ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీకి బి – టీమ్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్న
కేసీఆర్ ఇప్పుడు ఉన్నట్టుండి ఎదురు దాడి చేయడం ఇటు టీఆర్ఎస్ అటు కాషాయ పార్టీ శ్రేణులను విస్తు పోయేలా చేసింది.
కాగా రాజ్యాంగాన్ని మార్చాలన్న కామెంట్ పై ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదని పేర్కొంటున్నారు.
పూర్తిగా అహంకార ధోరణిని తెలియ చేస్తుందే తప్పా మరొకటి కాదంటున్నారు బీఎస్పీ నాయకుడు ప్రవీణ్ కుమార్. ఇదే క్రమంలో కేసీఆర్ (KCR MODI )తీసుకున్న స్టాండ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఏది ఏమైనా కేసీఆర్ స్ట్రాటజీని ఎవరూ ఊహించ లేరు. అంచనాకు కూడా రాలేరు. ఒక మాట మాట్లాడేందుకు ఆయన ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాడు.
సీఎం ఉన్నట్టుండి దాడి వెనుక ఏమై ఉంటుందన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
Also Read : అందని అందం నవ్వు అపురూపం