Aakash Chopra : ఐపీఎల్ వేలంలో అత‌డే రైజింగ్ స్టార్

శ్రేయ‌స్ అయ్య‌ర్ కు ఎక్కువ ధ‌ర రావ‌చ్చు

Aakash Chopra : ప్ర‌పంచ‌మంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ – ఐపీఎల్ రిచ్ లీగ్ నిర్వ‌హించేందుకు బీసీసీఐ డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగా టోర్నీ కంటే ముందే మెగా వేలం పాటకు సిద్ద‌మైంది.

ఈనెల 12, 13ల‌లో బెంగ‌ళూరు వేదిక‌గా వేలం పాట కొన‌సాగుతుంది. ఇందు కోసం ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది బీసీసీఐ. ఈ మొత్తం త‌తంగంలో 1124 మంది క్రికెట‌ర్లు మెగా ఆక్ష‌న్ కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

అయితే ఇందులో అర్హులైన వారిగా కేవ‌లం 590 మంది ప్లేయ‌ర్ల‌నే ఎంపిక చేసింది. భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి. ఈ త‌రుణంలో ఏయే ఆట‌గాళ్ల‌కు ఎక్కువ డిమాండ్ ఉంటుంద‌నే దానిపై ఓ అంచ‌నాకు వ‌చ్చిన‌ట్లు తెలిపాడు భార‌త క్రికెట్ మాజీ క్రికెట‌ర్ ,

ప్ర‌ముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా. ఎవ‌రు ఈ ఐపీఎల్ వేలంలో అత్యంత ఎక్కువ ధ‌ర‌కు అమ్ముడు పోతార‌నే దానిపై క్లారిటీ ఇచ్చాడు. ఇది కేవ‌లం త‌న అభిప్రాయం మాత్ర‌మేన‌ని తాను ఎవ‌రినీ సపోర్టు చేయ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశాడు చోప్రా(Aakash Chopra).

ఈసారి వేలంలో శ్రేయాస్ అయ్య‌ర్ టాప్ ధ‌ర ప‌లుకుతాడంటూ జోస్యం చెప్పాడు. మార్కీ ప్లేయ‌ర్ల జాబితాలో చోటు ద‌క్కించుకున్న అయ్య‌ర్ అన్ని జ‌ట్లు పోటీ ప‌డ‌టం ఖాయ‌మ‌న్నాడు.

ధావ‌న్, ష‌మీ, అశ్విన్, అయ్య‌ర్ లు ఉన్న‌ప్ప‌టికీ వీరింద‌రి కంటే అత‌డికే ఎక్కువ ఛాన్స్ ఉంద‌న్నాడు. విచిత్రం ఏమిటంటే కేకేఆర్ లేదంటే ఆర్సీబీ స్కిప్పర్ కావ‌డం ఖాయ‌మ‌న్నాడు.

ఇదిలా ఉండగా అయ్య‌ర్ మొద‌ట్లో అహ్మ‌దాబాద్ కు సార‌థ్యం వ‌హిస్తాడ‌ని అనుకున్నారు. కానీ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో అయ్య‌ర్ ను కాద‌ని హార్దిక్ పాండ్యాను ఎంచుకుంది.

Also Read : ఐసీసీ ర్యాంకింగ్స్ లో మెరిసిన మిథాలీ రాజ్

Leave A Reply

Your Email Id will not be published!