IND U19 vs AUS U19 : వెస్టిండీస్ లోని ఆంటిగ్వా కూలిడ్జ్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీలో(IND U19 vs AUS U19) భాగంగా ఆస్ట్రేలియా అండర్ -19 తో జరిగిన సెమీ ఫైనల్ లో భారత యువ ఆటగాళ్లు చెలరేగారు.
ప్రధానంగా కరోనా నుంచి బయట పడి తిరిగి జట్టులోకి వచ్చిన యువ సారథి యశ్ ధుల్ ,
ఆంధ్రా ఆటగాడు షేక్ రషీద్ దుమ్ము రేపారు. ప్రత్యర్థి జట్టు ముందు భారీ టార్గెట్ ముందుంచారు. భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
నిర్ణీత ఓవర్లలో టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. భారీ టార్గెట్ ఆసిస్ జట్టు ముందుంచింది.
ఈ పరుగులలో కెప్టెన్ యశ్ ధుల్ 110 పరుగులు చేస్తే షేక్ రషీద్ 94 పరుగులు చేశారు.
108 బంతులు ఎదుర్కొన్న రషీద్ ఈ పరుగులు చేశాడు. డెత్ ఓవర్లలో దినేష్ బానా రాణించాడు. దీంతో భారత జట్టు గౌరవ ప్రదమైన స్కోర్ సాధించింది.
ఆసిస్ తరపున జాక్ నిస్సెట్, విలియం సాల్ట్ మాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఇక యశ్ ధుల్ , రషీద్ లు చెలరేగడంతో ఆసిస్ బౌలర్లు కట్టడి చేయలేక పోయారు. వీరిద్దరూ అవుట్ అయ్యాక వెంట వెంటనే వికెట్లు కోల్పోయాయి.
ఇక 291 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే ఒక వికెట్ కోల్పోయింది.
క్యాంప్ బెల్ కెల్లావే, కోరీ మిల్లర్ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. అంతకు ముందు భారత జట్టు ఆసిస్ ను ఇదే వరల్డ్ కప్ లో రెండు సార్లు ఓడించింది.
ఇదిలా ఉండగా ఫస్ట్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో 24 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ యువ జట్టు ఆప్గనిస్తాన్ ను ఓడించి ఫైనల్ కు చేరింది. ప్రస్తుతం జరుగుతున్నది రెండో సెమీ ఫైనల్ మ్యాచ్.
Also Read : ‘దాదా’ వ్యవహారం చర్చనీయాంశం