Xiaomi Real Me : ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఓ బ్రాండ్ ఏర్పాటు చేసుకున్న కొన్నేళ్ల నుంచి కొనసాగుతూ వచ్చిన శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీకి కోలుకోలేని షాక్ తగిలింది.
ఎప్పటికప్పుడు మార్కెట్ వ్యూహాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నాయి చైనాకు చెందిన దిగ్గజ కంపెనీలు. ఒకప్పుడు వాటిని అగ్గిపెట్టలతో పోల్చిన టాప్ కంపెనీలన్నీ ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి.
ఇక ఎప్పటిలాగే యాపిల్ తన ర్యాంకు కోల్పోకుండా కాపాడుకుంటూ వస్తోంది. ఇక నోకియా సత్తా చాటేందుకు నానా తంటాలు పడుతోంది. ఇక ఈసారి శాంసంగ్ కు గట్టి దెబ్బ పడింది.
ఇదిలా ఉండా ఇండియాలో మొబైల్స్ అమ్మకాలకు సంబంధించి 2021 సంవత్సరానికి గాను క్యూ 4 రిజల్ట్స్ రిలీజ్ చేసింది. ఇందులో ఏకంగా ఊహించని రీతిలో శాంసంగ్ ను వెనక్కి నెట్టేసింది రియల్ మీ.
17 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుని దిగ్గజ కంపెనీకి ఝలక్ ఇచ్చింది. భారత్ లో మార్కెట్ పరంగా టాప్ సెకండ్ లో నిలిచింది. ఇక ఇదే చైనాకు చెందిన మరో కంపెనీ షావోమీ(Xiaomi Real Me) ఎప్పటి లాగానే తన సత్తా చాటింది మరోసారి.
టాప్ వన్ లో నిలిచింది. కాగా శాంసంగ్ 16 శాతం తో మూడో స్థానంతో సరి పెట్టుకుంది. మొదటి స్థానంలో ఉన్న షావోమీ ఊహించని విధంగా 24 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది.
ఇతర కంపెనీలకు కోలుకోలేని షాక్ కు గురి చేసింది. ప్రధానంగా చైనా కంపెనీలు తక్కువ ధరతో పాటు ఎక్కువ ఫీచర్స్ ఉండేలా జాగ్రత్త పడుతున్నాయి. ప్రధానంగా అన్ని వర్గాలను ఆకుట్టునేలా మొబైల్స్ ను తయారు చేస్తున్నారు.
దీంతో ధర తక్కువ, నాణ్యత, ఫీచర్స్ ఎక్కువగా ఉండడంతో వీటినే కొనుగోలు చేసేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు కొనుగోలుదారులు.
Also Read : తగ్గేదే లేదంటున్న గూగుల్