Michael Clarke : పృథ్వీ షా సెహ్వాగ్ లాంటోడు

భార‌త బ్యాట‌ర్ కు క్లార్క్ కితాబు

Michael Clarke : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. భార‌త స్టార్ ప్లేయ‌ర్ గా పేరొందిన పృథ్యీ షా అద్బుత‌మైన ఆట‌గాడంటూ పేర్కొన్నాడు.

అంతే కాదు షాను భార‌త మాజీ క్రికెట‌ర్, స్టార్ హిట్ట‌ర్ గా పేరొందిన వీరేంద్ర సెహ్వాగ్ తో పోల్చాడు క్లార్క్. మైదానంలో చురుకుగా ఉంటాడ‌ని, ఎప్పుడైనా స‌రే అటాకింగ్ మూడ్ లో ఉంటాడ‌ని పేర్కొన్నాడు.

ఇలాంటి ఆట‌గాళ్లు చాలా అరుదుగా క‌నిపిస్తార‌న్నాడు. ఇదిలా ఉండ‌గా పృథ్వీ షా ఎప్పుడు మాట్లాడినా త‌న ఆట తీరుపై ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ రికీ పాంటింగ్ ప్ర‌భావం ఉందంటూ చెబుతూ ఉంటాడ‌ని గుర్తు చేశాడు మైకేల్ క్లార్క్.

ప్ర‌స్తుతం పేల‌వ‌మైన ఆట తీరుతో జ‌ట్టుకు ఎంపిక కాలేక పోతున్నాడ‌ని పేర్కొన్నాడు. అయితే షాను బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అంటూ కితాబు ఇచ్చాడు. తాను చూసిన ఈ త‌రం యువ ఆట‌గాళ్ల‌లో పృథ్వీ షా ఒక‌డ‌ని స్ప‌ష్టం చేశాడు మైకేల్ క్లార్క్(Michael Clarke).

ఇదిలా ఉండ‌గా సోనీ టెన్ డౌన్ అండ‌ర్ డాగ్స్ అనే డాక్యుమెంట‌రీ సంద‌ర్భంగా క్లార్క్ ఈ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. సెహ్వాగ్ అటాకింగ్ డిఫ‌రెంట్ గా ఉంటుంది.

అదే స‌మ‌యంలో ఆట‌ను ముందుకు తీసుకు వెళ్ల‌డంలో పృథ్వీ షా స‌క్సెస్ అయ్యాడ‌ని కానీ అనుకోని రీతిలో కొన‌సాగించ లేక పోవ‌డం త‌న‌ను బాధ‌కు గురి చేసింద‌న్నాడు.

అయితే భార‌త సెల‌క్ష‌న్ క‌మిటీకి ఓ సూచ‌న చేశాడు మైకేల్ క్లార్క్(Michael Clarke). త‌న‌కు ఇష్ట‌మైన ఆట‌గాళ్ల‌లో ఒక‌డ‌ని పేర్కొంటూనే షాకు మ‌రో ఛాన్స్ ఇచ్చి చూడాల‌ని కోరాడు. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ లో స్థిర ప‌డాలంటే మ‌రింత స‌మ‌యం కావాల‌న్నాడు.

Also Read : వెంటాడుతున్న క‌రోనా మ్యాచ్ జ‌రిగేనా

Leave A Reply

Your Email Id will not be published!