Hardik Pandya : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ – ఐపీఎల్ 2022 కి సంబంధించి కొత్తగా జాయిన్ అయిన అహ్మదాబాద్ స్కిప్పర్ గా ఎంపికైన హార్దిక్ పాండ్యా(Hardik Pandya )సంచలన కామెంట్స్ చేశాడు.
భారత క్రికెట్ జట్టుకు ఇప్పటి దాకా నాయకత్వం వహించిన ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ తో పాటు ప్రస్తుత టీమిండియా స్కిప్పర్ రోహిత్ శర్మల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వారి సారథ్యంలో తాను ఆడానని వారి నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పాడు. ఇవాళ జాతీయ మీడియాతో మాట్లాడాడు హార్దిక్ పాండ్యా. వారిలో ఉన్న క్వాలిటీస్ ను తాను గమనిస్తూ నేర్చుకున్నానని తెలిపాడు.
ఈ సందర్భంగా ఆ ముగ్గురిని తాను జీవితంలో మరిచి పోలేనని పేర్కొన్నాడు. ప్రత్యేకంగా ధోనీ నాయకత్వ పటిమ గొప్పదన్నాడు. అతడితో ఆడడం చాలా సంతోషం కలిగించిందన్నాడు హార్దిక్ పాండ్యా(Hardik Pandya ).
ఎలాంటి సమయంలో నైనా కూల్ గా ఉండటం ఆయనకే చెల్లిందని కితాబు ఇచ్చాడు. ఇక విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి కీలక కామెంట్స్ చేశాడు. ఎక్కడా ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోడని అది తనను ఎంతగానో ప్రభావితం చేసిందన్నాడు.
ఇదే సమయంలో మైదానం వెలుపల ఫ్రెండ్లీగా ఉంటాడని కానీ గ్రౌండ్ లోకి వచ్చేసరికల్లా పూర్తిగా మారి పోతాడని పేర్కొన్నాడు. ధోనీకి పూర్తిగా భిన్నంగా ఉంటాడని దూకుడు కావాలంటే కోహ్లీని చూసి నేర్చుకున్నానని స్పష్టం చేశాడు.
ఐపీఎల్ లో భాగంగా పాండ్యా ముంబై ఇండియన్స్ లో ఆడాడు. దీనికి నాయకత్వం వహించిన రోహిత్ శర్మ మిస్టర్ కూల్ అంటూ కితాబు ఇచ్చాడు. ప్రస్తుతం తనకు జరగబోయే ఐపీఎల్ సవాల్ లాంటిదన్నాడు.
Also Read : కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు దంచి కొట్టారు