Sourav Ganguly : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ – బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగిన సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న అనంతరం దాదా మాట్లాడాడు.
ప్రధానంగా ఆయన చేసిన కామెంట్స్ స్టార్ ఆటగాళ్లు అంజిక్యా రహానే, చతేశ్వర పుజారాకు ఒక రకంగా హెచ్చరికగానే భావించాల్సి ఉంటుంది. ప్రపంచ క్రికెట్ లో ఎంతటి గొప్ప ప్లేయర్ అయినా ఒక్కోసారి ఫామ్ కోల్పోవాల్సి వస్తుందని చెప్పాడు.
మహామహులైన దిగ్గజ ఆటగాళ్లు ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొన్నారని చెప్పాడు. అయితే రహానే, పుజారా ఇద్దరూ అద్భుతమైన ప్లేయర్లు అంటూ కితాబు ఇచ్చాడు. ఇప్పటికే ఐపీఎల్ వేదికల ఖరారుతో పాటు రంజీ ట్రోఫీ ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై క్లారిటీ ఇచ్చాడు.
కరోనా కారణంగా ఈసారి రంజీ ట్రోఫీని ఐపీఎల్ కంటే ముందు వెనుకా నిర్వహించనుంది బీసీసీఐ. ఈ సందర్భంగా అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ ఇద్దరు ఆటగాళ్లు ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్నారు.
తిరిగి ఆ ఫామ్ రావాలంటే దేశీవాళి టోర్నీ రంజీ ట్రోఫీలో ఆడాలని సూచించాడు. ఇందు వల్ల ఆటపై ఫోకస్ పెట్టేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నాడు సౌరవ్ గంగూలీ(Sourav Ganguly).
ఈ సీజన్ వారికి చక్కగా ఉపయోగ పడుతుందన్నాడు. ఇలాగే ఉంటే మాత్రం టీమ్ లో కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించాడు.
వారిద్దరూ అద్భుతంగా జట్టుకు సేవలు అందించారని కానీ ఫామ్ రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు దాదా.
Also Read : ఆరు నూరైనా ఐపీఎల్ ఇండియాలోనే