Aus VS Pak Tour : పాకిస్తాన్ తో ఆసిస్ సీరీస్ సిద్దం

24 ఏళ్ల అనంత‌రం ఆటకు ఓకే

Aus VS Pak Tour : భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా ఇంత కాలం పాకిస్తాన్ కు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చిన ఆయా క్రికెట్ ఆడే దేశాలు త‌మ నిర్ణ‌యాన్ని మార్చుకుంటున్నాయి.

తాజాగా సుదీర్ఘ కాలం త‌ర్వాత పాకిస్తాన్ లో ఆడేందుకు ఓకే చెప్పింది క్రికెట్ ఆస్ట్రేలియా.

దాదాపు 24 ఏళ్ల అనంత‌రం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ ) , క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)(Aus VS Pak Tour) ఒప్పందం చేసుకున్నాయి.

గ‌త ఏడాదిలోనే ఆస్ట్రేలియా టూర్ పాకిస్తాన్ లో ఉండాల్సి ఉంది.

భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా తాము ఆడ‌లేమంటూ పీసీబీ చైర్మ‌న్ ర‌మీజ్ ర‌జాకు తెలియ చేసింది సీఏ.

ఇక పాకిస్తాన్ లో ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆస్ట్రేలియా జ‌ట్టు టెస్టులు, మూడు వ‌న్డేలు, ఒక టీ20 మ్యాచ్ లు ఆడ‌నుంది.

ఇరు క్రికెట్ బోర్డుల ఒప్పందంలో భాగంగా క్రికెట్ షెడ్యూల్ ను ప్ర‌క‌టించింది.

మూడు టెస్టులలో భాగంగా మొద‌టి టెస్టు రావిల్పిండిలో, రెండో టెస్టు క‌రాచీలో, మూడో టెస్టు లాహోర్ లో జ‌రుగుతుంది.

ఇక మూడు వ‌న్డే మ్యాచ్ ల‌తో పాటు ఏకైక టీ20 మ్యాచ్ ఒకే వేదిక రావిల్పిండి వేదిక లోనే నిర్వ‌హించ‌నుంది పీసీబీ.

ఈ విష‌యాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్ల‌డించింది. ఇక ఆస్ట్రేలియా జ‌ట్టు చివ‌రి సారిగా 1998లో పాకిస్తాన్ లో ప‌ర్య‌టించింది. ఆనాటి నుంచి భ‌ద్ర‌తా కార‌ణాల సాకు చూపి ఆడ‌లేదు ఆస్ట్రేలియా టీమ్.

ప్ర‌స్తుతం ఆసిస్ ఇంగ్లండ్ ను ఓడించి ఫుల్ ఫామ్ లో ఉంది. ఇక టూర్ ప‌రంగా చూస్తే మార్చి 4 నుంచి 8 వ‌ర‌కు తొలి టెస్టు, 12 నుంచి 16 వ‌ర‌కు రెండో టెస్టు , 21 నుంచి 25 దాకా మూడో టెస్టు ఆడ‌నుంది.

మొద‌టి వ‌న్డే 29న‌, 31న రెండో వ‌న్డే, మూడో వ‌న్డే ఏప్రిల్ 2న జ‌రుగుతుంది. ఇక ఏకైక టీ20 మ్యాచ్ 5న జ‌రుగుతుంది.

Also Read : చ‌రిత్ర‌కు చేరువులో యువ భార‌త్

Leave A Reply

Your Email Id will not be published!