Dravid : వెస్టిండీస్ తో ఈనెల 6న అహ్మదాబాద్ వేదికగా టూర్ స్టార్ట్ కాబోతోంది. ఇందు కోసం భారత క్రికెట్ జట్టు ముమ్మరంగా ప్రాక్టీస్ సెషన్ లో నిమగ్నమైంది.
ఇప్పటికే సౌతాఫ్రికా టూర్ లో మూడు వన్డేలతో పాటు 2 టెస్టు మ్యాచ్ లు కోల్పోయింది టీమిండియా. ఉన్న పరువు పోగొట్టుకుంది. ఇదే సమయంలో పూర్తి కాలపు కెప్టెన్ గా రోహిత్ శర్మ(Dravid Rohith )సారథ్యంలో భారత జట్టు టీ20, వన్డే మ్యాచ్ లు ఆడనుంది.
ఇదిలా ఉండగా ఎనిమిది ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. ఇదిలా ఉండగా రేపటి మ్యాచ్ కు సంబంధించి భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ భారత ఆటగాళ్లకు దిశా నిర్దేశం చేశారు.
ఎలాంటి వ్యూహాలు అనుసరించాలన్న దానిపై ఫోకస్ పెట్టారు వీరిద్దరూ. ఇప్పటికే స్వదేశంలో జరిగిన కీవీస్ తో సీరీస్ కైవసం చేసుకున్న టీమిండియా సఫారీ టూర్ లో చేతులెత్తేసింది.
దీంతో భారత జట్టు ఆట తీరుపై, ద్రవిడ్(Dravid Rohith )అనుసరిస్తున్న మెతక వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం జరిగే విండీస్ తో సీరీస్ భారత జట్టుకు డూ ఆర్ డై గా మారింది.
ఇదిలా ఉండగా తీవ్ర గాయం కారణంగా పూర్తిగా దక్షిణాఫ్రికా టూర్ కు దూరంగా ఉన్నారు. దీంతో విండీస్ తో ఆడేందుకు నెట్స్ లో కష్టపడుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శార్దూల్ ఠాకూర్ , రిషబ్ పంత్ ప్రాక్టీస్ చేశారు.
ఇందుకు సంబంధించి బీసీసీఐ ఫోటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం అందరి కళ్లు విండీస్ తో జరిగే మ్యాచ్ పైనే ఉన్నాయి. సుదీర్ఘ కాలం పాటు భారత జట్టుకు స్కిప్పర్ గా ఉన్న కోహ్లీ ఇప్పుడు కేవలం ఆటగాడిగా మాత్రమే ఆడనున్నాడు.
Also Read : రూల్స్ తెలియకుండానే బాస్ అయ్యానా