Pawan Kalyan : స‌మ‌తామూర్తి మార్గం ఆచ‌ర‌ణీయం

జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్

Pawan Kalyan : స‌మ‌తామూర్తి చూపిన మార్గాన్ని అనుస‌రించాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు జ‌న‌సేన చీఫ్‌, టాలీవుడ్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఆయ‌న ముచ్చింత‌ల్ లోని శ్రీ‌రామ‌న‌గ‌రంను ద‌ర్శించుకున్నారు.

ఈ సంద‌ర్భంగా 216 అడుగుల‌తో నిర్మించిన రామాజుడి విగ్ర‌హానికి న‌మ‌స్క‌రించారు. అనంత‌రం శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు.

స్వామి ప‌వ‌న్ క‌ళ్యాణ్ మెడ‌లో ఓ జ‌ప‌మాల వేశారు. రాబోయే రోజుల్లో మంచి జ‌ర‌గాల‌ని ఆకాంక్షించారు. స‌మ‌తామూర్తిని ఉద్దేశించి ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) ప్ర‌సంగించారు. త‌న‌కు ఇవాళ సంతోషంగా ఉంద‌న్నారు.

రామానుజుడి స‌మారోహ మ‌హోత్స‌వాల‌లో పాల్గొన‌డాన్ని అదృష్టంగా భావిస్తున్నాన‌ని చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. త‌న‌ను ఆహ్వానించిన నిర్వాహ‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

వెయ్యేళ్ల కింద‌ట తిరుమంత్రాన్ని పామ‌రులు, ద‌ళితుల‌కు వినిపించిన గొప్ప సంస్క‌ర్త శ్రీ రామానుజుడు అని కొనియాడారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. స‌మ‌తామూర్తి చూపిన మార్గం ఆచ‌ర‌ణీయం అని పేర్కొన్నారు.

కుల‌, మ‌తాలు ఉండ కూడ‌ద‌ని దైవం అంద‌రికీ స‌మాన‌మ‌ని చాటి చెప్పిన మ‌హ‌నీయుడు శ్రీ రామానుజుడు అని ప్ర‌శంసించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

పండితుల‌కే కాదు పామ‌రుల‌కు కూడా ఆల‌య ప్ర‌వేశం ఉండాల‌ని, స‌ర్వ ప్రాణుల‌న్నీ ఒక్క‌టేన‌న్న ఆయ‌న స‌మ‌తా సందేశం గొప్ప‌ద‌న్నారు. అందుకే రామానుజుడు అంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని చెప్పారు జ‌న‌సేనాని.

108 దివ్య దేశాల ఆల‌యాల‌ను ఒకే చోట ఏర్పాటు చేయ‌డం ఎంతో గొప్ప‌ద‌న్నారు. కాగా ఈ విగ్ర‌హాన్ని రూ. 1000 కోట్ల‌తో నిర్మించారు. దీనిని చైనాలో త‌యారు చేశారు.

Also Read : దైవం స‌మ‌స్త మాన‌వాళికి అవ‌స‌రం

Leave A Reply

Your Email Id will not be published!