Chinnajeeyar Swamy : దైవం స‌మ‌స్త మాన‌వాళికి అవ‌స‌రం

శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న‌సీయ‌ర్ స్వామి

Chinnajeeyar Swamy : దైవం అన్న‌ది ప్ర‌తి ఒక్క‌రిలో ఉంటుంద‌ని సెల‌విచ్చారు జ‌గ‌త్ గురు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి(Chinnajeeyar Swamy). ముచ్చింత‌ల్ లోని శ్రీ‌రామ‌న‌గ‌రం ఆశ్ర‌మంలో జ‌రుగుతున్న సమ‌తామూర్తి మ‌హోత్స‌వాలు ఇవాల్టితో ఐదో రోజుకు చేరుకున్నాయి.

ఇవాళ స‌హ‌స్రాబ్ది స‌మారోహం లో భాగంగా అష్టాక్ష‌రీ మంత్ర జ‌పం విశిష్ట‌త‌కు గురించి బోధించారు. మంత్రం అంటే ఏమిటి. జ‌పం అంటే ఏమిటి. ఏకాగ్ర‌త ఎలా ఆపాదించు కోవాల‌నే దానిపై దృష్టి సారించాల‌ని సూచించారు.

మ‌న‌సు కోరే యాత్ర‌ను ఆపాలంటే దైవానికి సంబంధించిన భావ‌న‌తో క‌లిగి ఉండాల‌న్నారు. జ‌పం చేయాలంటే మంత్ర అనుష్టానం క‌లిగి ఉండాలంటే ఇత‌ర ఆలోచ‌న‌ల‌ను ప‌క్క‌న పెట్టాల‌న్నారు.

మంత్రం కంటే ముందు మ‌న‌మంతా ధ్యానం చేద్దామ‌ని పిలుపునిచ్చారు. ఇక స‌హ‌స్రాబ్ది మ‌హోత్స‌వాల‌కు భారీ ఎత్తున భ‌క్తులు చేరుకున్నారు. స‌మ‌తా కేంద్రం అంతా వేద మంత్రాల‌తో, జై శ్రీ‌మ‌న్నారాయ‌ణ నినాదాల‌తో మారుమ్రోగింది.

ఇక ధ్యానం, మంత్రం రెండూ అద్భుత‌మైన సాధ‌నాలు. జీవ‌న విధానంలో అవి అత్యంత ప్రాముఖ్య‌త‌ను క‌లిగి ఉంటాయి. వాటిని సాధించాలంటే మ‌నం స‌న్న‌ద్దుల‌మై ఉండాలి.

అందుకే నియ‌మ‌, నిష్ట‌త అన్న‌ది ప్ర‌ధానం. ముందుగా వీటిపై ప‌ట్టు సాధిస్తే అస‌లైన సాధానాల‌ను సాధించ గ‌ల‌మ‌ని బోధించారు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండ రామానుజ చిన్న‌జీయ‌ర్ స్వామిChinnajeeyar Swamy).

ఇదిలా ఉండ‌గా వెయ్యేళ్ల నాటి శ్రీ భ‌గ‌వ‌ద్ రామానుజాచార్యుల గురించి వివేకానందుడు గుర్తించి ఆయ‌న గొప్ప‌త‌నాన్ని లోకానికి చాటి చెప్పాడ‌ని గుర్తు చేశారు మ‌రికొంద‌రు స్వాములు. ఆ స‌మ‌తామూర్తి స్పూర్తి ఎల్ల‌ప్ప‌టికీ ఉంటుంద‌న్నారు.

Also Read : స‌మ‌తాకేంద్రం జాతికి అంకితం

Leave A Reply

Your Email Id will not be published!