BCCI : కుర్రాళ్ల‌కు బీసీసీఐ భారీ న‌జ‌రానా

యువ భార‌త్ వ‌ర‌ల్డ్ క‌ప్ కైవ‌సం

BCCI  : వెస్టిండీస్ వేదిక‌గా జ‌రిగిన అండ‌ర్ -19 వ‌రల్డ్ క‌ప్ ను ఇంగ్లండ్ జ‌ట్టును ఓడించి విజ‌యం సాధించిన భార‌త జ‌ట్టుపై దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

తాజాగా భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండలి – బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు బీసీసీఐ(BCCI )చీఫ్ సౌర‌వ్ గంగూలీ కుర్రాళ్ల‌ను అభినందించారు.

ప్ర‌త్యేక స‌మావేమైన బీసీసీఐ కుర్రాళ్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. కాసుల వ‌ర్షం కురిపించింది. ఐదోసారి విశ్వ విజేత‌గా నిలిచింది యువ భార‌త జ‌ట్టు.

ఈ రిచ్ లీగ్ లో ఏ ఒక్క మ్యాచ్ ఓడి పోకుండానే వ‌ర‌ల్డ్ క‌ప్ చేజిక్కించుకుంది. క‌రోనా బారిన ప‌డినా చివ‌ర‌కు కోలుకుని అనుకున్న‌ది సాధించారు కుర్రాళ్లు. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో కూడా త‌మ స‌త్తా చాటారు.

జ‌ట్టులోని ప్ర‌తి స‌భ్యుడికి రూ. 40 ల‌క్ష‌లు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది బీసీసీఐ. ప్ర‌ధానంగా యువ భార‌త్ టీమ్ లో కెప్టెన్ య‌శ్ ధుల్ , ర‌ఘు వంశీ, హర్నూర్, ర‌షీద్ , నిశాంత్ , రాజ్ బావా, విక్కీ బ‌స్త్ వాల్ , ర‌వికు మార్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు.

చివ‌రి పోరులో విజేత‌లుగా నిలిచారు. భార‌తీయ ప‌తాకం ఎగిరేలా చేశారు అండ‌ర్ భార‌త‌జ‌ట్టు. రాజ్ బావా ప్లేయ‌ర్ ఆఫ్ ద ఫైన‌ల్ గా ఎంపిక కాగా ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ బ్రెవిస్ ప్లేయ‌ర్ ఆఫ్ ద సీరీస్ అవార్డు అందుకున్నారు.

ఇక వ‌ర‌ల్డ్ క‌ప్ తీసుకు వ‌చ్చిన టీమ్ కు రూ. 40 ల‌క్ష‌ల చొప్పున‌, కోచ్, ఇత‌ర స‌హాయ‌క సిబ్బందికి రూ. 25 ల‌క్ష‌ల చొప్పున ఇవ్వ‌నున్న‌ట్లు బీసీసీఐ డిక్లేర్ చేసింది. బీసీసీఐ యువ జ‌ట్టును స‌న్మానించ‌నుంది.

Also Read : వెయ్యో వ‌న్డేలో టీమిండియా విక్ట‌రీ

Leave A Reply

Your Email Id will not be published!