Shivraj Singh Chouhan : భారత దేశం గర్వించ దగిన గాయని లతా మంగేష్కర్ కన్ను మూయడాన్ని దేశం మరిచి పోలేక పోతోంది. కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది.
ఇవాళ ఆమెకు నివాళిగా రాజ్యసభ గంటకు పైగా వాయిదా వేసింది. ఈ తరుణంలో లతా మంగేష్కర్ స్వంత స్థలం మధ్య ప్రదేశ్ లోని ఇండోర్.
ఈ సందర్భంగా ఆ మహా గాయనిని ఎల్లప్పటికీ గుర్తుంచుకునేలా తాము నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan).
ఆమె జ్ఞాపకార్థం ఎల్లప్పటికీ స్ఫూర్తి కలిగి ఉండేలా మ్యూజిక్ అకాడెమీతో పాటు ఆమె పేరుతో మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు లతా మంగేష్కర్ గురించి భారత రత్న లతాజీతో ఈ రాష్ట్రానికి ఎనలేని బంధం ఉంది. ఇవాళ ఆమె లేక పోవచ్చు.
కానీ ఆమె స్వరం అలాగే ఉంది. ఉంటూనే ఉంటుందన్నారు సీఎం. ఇక్కడ పిల్లలకు ఉచితంగా లతా అకాడెమీలో సంగీతాన్ని నేర్పించడం జరుగుతుందన్నారు చౌహాన్.
దీదీ పాటలన్నీ అందుబాటులో ఉండేలా మ్యూజియం కూడా నిర్మిస్తామని ఇవాళ ప్రకటించారు సీఎం. ఆమె విగ్రహాన్ని కూడా ఇండోర్ లో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ప్రతి రోజు లతా మంగేష్కర్ పుట్టిన రోజున ఆమె పేరుతో అవార్డు కూడా ఇస్తామని స్పష్టం చేశారు మధ్య ప్రదేశ్ సీఎం . ఆమె సంగీతానికి మాత్రమే స్పూర్తి కాదని దేశభక్తురాలని కొనియాడారు చౌహాన్.
Also Read : సమున్నత భారతం శోక సంద్రం