Ajinkya Rahane : భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించి విజయాన్ని సాధించి పెట్టిన ఆటగాడు అతను. కానీ పరిస్థితి ఇప్పుడు అప్పటిలా లేదు. తీవ్రమైన ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతూ చివరకు జట్టులో స్థానం ఉంటుందో లేదో నన్న సందిగ్ధంలో ఉన్నాడు అజింక్యా రహానే.
ఆటలోనే కాదు వ్యక్తిత్వంలోనూ అందరికీ ఆదర్శ ప్రాయంగా ఉండే రహానే గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలోనే దిగ్గజ ఆటగాడిగా పేరొందిన ఆసిస్ మాజీ ప్లేయర్ రికీ పాంటింగ్ రహానే(Ajinkya Rahane) విషయంలో కీలక కామెంట్స్ చేశాడు.
అద్భుతమైన టైమింగ్ ఉన్న ఆటగాడిగా పేర్కొన్నాడు. టెక్నిక్ ఒక్కటి సర్దుకుంటే మళ్లీ గాడిలో పడతాడని సూచించాడు. రహానే భారత జట్టుకు తాత్కాలికంగా నాయకత్వం వహించినా జట్టు పరంగా సాధించిన ఎన్నో విజయాలలో కీలక పాత్ర పోషించాడు.
ఒక్కోసారి జట్టును ఓడి పోకుండా రక్షించాడు. కానీ ఇప్పుడు పేలవమైన ఆట తీరుతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇలా ఆడితే ఇక కష్టమని హెచ్చరించాడు భారత క్రికెట్ నియత్రణ మండలి – బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ.
ప్రపంచంలో ఎంత గొప్ప ఆటగాడికైనా ఒక్కోసారి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందని చెప్పాడు. తాను కూడా ఎదుర్కొన్నానని తెలిపాడు.
ఇలాంటి సందర్భం ఎదురైన సమయంలో తాను మళ్లీ రంజీ ట్రోఫీ మ్యాచ్ లలో పాల్గొని తిరిగి ఫామ్ లోకి వచ్చానని తెలిపాడు. ఇదిలా ఉండగా తన కెప్టెన్సీ లో ఆడిన పృథ్వీ షా సారథ్యంలో ఇప్పుడు రహానే రంజీకి రెడీ అయ్యాడు. ఎంత విచిత్రం కదూ.
Also Read : టెండూల్కర్ కన్నీటి పర్యంతం